317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్ ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు (జీవో 317కు) సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు… సీఎస్ శాంతి కుమారి జీఓ ఎంఎస్ నెం.243, 244, 245 మార్గదర్శకాలను జారీ చేశారు.
ఉద్యోగుల సమస్యలను మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు కేటగిరీలకు వేర్వేరుగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకే సబ్జెక్టు బోధించే ఇద్దరు ఉద్యోగులు ఒకరి స్థానంలోకి మరొకరు పరస్పర అవగాహనతో బదిలీ అయ్యేందుకు అవకాశాన్ని కల్పించింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు మేరకు 317జీవో బాధితుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ కోసం వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆ మేరకు జీవో 245ను ప్రభుత్వం విడుదల చేసింది.