తెలంగాణ (TG) ప్రభుత్వం సచివాలయంలో భారీ స్థాయిలో బదిలీలు చేపట్టింది. మొత్తం 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు (ASOs) ను ఒకేసారి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర కార్యాలయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఈ స్థాయి ఉద్యోగులను ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడం చాలా అరుదు. అందుకే ఈ చర్య వెనక ఉన్న కారణాలపై ఆసక్తి నెలకొంది.
Read Also: Uttam Kumar: రైతాంగానికి బాసటగా నిలుస్తాం ధాన్యం దిగుబడి కొనుగోళ్లలో రికార్డు
వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం (TG) ఒకేసారి వీరందరిని బదిలీ చేయడం వెనక బలమైన కారణమే ఉంది. వీరంతా నిబంధనలకు వ్యతిరేకంగా ఒకే శాఖలో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారు. దీనిపై ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. వీరిని బదిలీ చేయాలని కోరినా ప్రభుత్వం అప్పుడు స్పందించలేదు. కానీ తాజాగా ఒకేసారి 134 ఏఎస్ఒలను బదిలీ చేసింది.
వీరిలో కొందరు సుమారు 12 సంవత్సరాలుగా ఒకే శాఖలో కొనసాగుతున్నారు. అలాంటి వారందరిని ప్రస్తుతం ఇతర శాఖలకు బదిలీ చేస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.బదిలీకి సంబంధించి.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎక్కువ మంది సాధారణ పరిపాలన శాఖ
మొత్తం 134 మంది ఏఎస్ఓల (Assistant Section Officers) ను సచివాలయంలోని ఒక శాఖ నుంచి మరోక డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ), బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, వ్యవసాయం, పశు సంవర్థక, అడవులు, హోం, సాగునీటి పారుదల, పరిశ్రమలు, విద్యుత్తు, వైద్య ఆరోగ్యం, ఉన్నత విద్య, పురపాలక,
మైనారిటీల సంక్షేమం, రెవెన్యూ, ప్రణాళిక, పంచాయతీరాజ్, గిరిజన, ఎస్సీ అభివృద్ధి, రవాణా, యువజన సర్వీసుల శాఖ, మహిళా సంక్షేమం శాఖల నుంచి ఈ 134 మంది ఏఎస్ఓలను బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పరిపాలన శాఖ నుంచే ఉన్నారు. ఈ ఒక్క డిపార్ట్‌మెంట్ నుంచి ఏకంగా 28 మంది ఏఎస్ఓలను ప్రభుత్వం బదిలీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: