సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. కాగా సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ మంగళవారం మధ్యాహ్నం ముగిసింది. అల్లు అర్జున్‌ను మధ్యాహ్నం 2.47 గంటల వరకు విచారించారు. ఈ విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగినపుడు రమేష్ కుమార్ కుమార్ అక్కడే ఉన్నారు.
అసలు ఈ రోజు థియేటర్‌లో ఏం జరిగిందో ఆదివారం ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు. ఘటన జరిగిన రోజు తామంతా సంధ్య థియేటర్ దగ్గరే ఉన్నామని, రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్‌కు చెప్పడానికి వెళితే అతడి మేనేజర్ అడ్డుకున్నాడని తెలిపారు.
డీసీపీ ఆదేశాల మేరకు తాను అల్లు అర్జున్ దగ్గరకు కష్టపడి చేరుకుని విషయం చెప్పానని, ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశానని, అయితే సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ తనకు చెప్పారని ప్రెస్‌మీట్‌లో రమేష్ వెల్లడించారు.
ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ సందర్భంగా అల్లు అర్జున్‌ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సేకరించిన వీడియోలు, సిసి ఫుటేజ్‌ను ముందు పెట్టి అల్లు అర్జున్‌ను విచారించినట్టు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని.. అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్‌కు పోలీసులు తెలిపారు.