हिन्दी | Epaper

లైసెన్స్‌లు రద్దు చేస్తాం: పొన్నం ప్రభాకర్ వార్నింగ్

Vanipushpa
లైసెన్స్‌లు రద్దు చేస్తాం: పొన్నం ప్రభాకర్ వార్నింగ్

రోడ్డు నిబంధనలు ఉల్లగించిన వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. రోడ్డు రవాణా , ఆర్టీసీ, భవనాలు రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ పాయింట్లను గుర్తించి తొలగిస్తామని చెప్పారు. ఈ నెల 7 వ తేదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రతపై చర్చిస్తామని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పై ఆవేర్నెస్ కల్పిస్తామని అన్నారు.

భాగ్యనగరంలో అనేక జంక్షన్‌లు వస్తున్నాయని.. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ ఒక ముగ్గరికి అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

రహదారి భద్రతా పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. రవాణా శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, విశ్వ ప్రసాద్ అడిషనల్ సీపీ ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం అయ్యాయని చెప్పారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ప్రమాదాలు నివారించాలని ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. తె

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో భారీగా పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మరణిస్తున్న కోళ్లు!

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ‘మిలియన్ మార్చ్’

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

బిఎలో డిఫెన్స్ .. మరో 10 కొత్త కోర్సులు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870