हिन्दी | Epaper
15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ఈరోజు నుంచి తెలంగాణ టెట్ కాలేజ్ బస్ బోల్తా.. 60 మందికి గాయాలు R&B శాఖలో 265 ఇంజినీర్ల పోస్టుల భర్తీకి సిద్ధం – మంత్రి కోమటిరెడ్డి కొత్త సిలబస్‌.. ఉన్నత విద్యలో మార్పులు

ముగిసిన అల్లు అర్జున్‌ విచారణ

Vanipushpa
ముగిసిన అల్లు అర్జున్‌ విచారణ

నేడు జరిగిన అల్లు అర్జున్‌ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు రెండున్నర గంటల పాటూ అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన.. అనంతరం జరిగిన పరిణామాలపై పోలీసులు బన్నిని ప్రశ్నించారు.
పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం
అడ్వొకేట్‌ అశోక్‌ రెడ్డి, ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ అల్లు అర్జున్‌ను విచారించారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్‌ షోకు అనుమతి తీసుకున్నారా..? లేదా..? అనుమతి లేకుండా రోడ్‌ షో ఎలా నిర్వహించారు..? రోడ్‌ షోకు పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు..? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
అల్లు అర్జున్‌ వాంగ్మూలం రికార్డు
విచారణలో అల్లు అర్జున్‌ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ సందర్భంగా పుష్పరాజ్‌ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. దాదాపు 20కిపైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్ని సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.

కాగా, సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో హైకోర్టు మధ్యంతర బెయిల్‌పై ఉన్న సినీనటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీస్‌ ఇచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పీఎస్‌కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల నోటీసులకు స్పందించిన బన్ని.. ఇవాళ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. తన తండ్రి అల్లు అరవిరంద్‌, మామ చంద్రశేఖర్‌ పీఎస్‌కు వెళ్లారు. ఈ కేసు క్రమంగా రాజకీయ రంగు ముసురుకుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ ల మధ్య వార్ నడుతున్నది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870