Telangana MPs meeting ongoing at Praja Bhavan

ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలంగాణ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే సమావేశానికి బీఆర్ఎస్ , బీజేపీ దూరంగా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో భట్టి విక్రమార్క సమావేశం నిర్వహిస్తున్నారు.

 ప్రజాభవన్‌లో కొనసాగుతున్న తెలంగాణ ఎంపీల

మీ ఆహ్వానానికి ధన్యవాదాలు

అఖిలపక్ష భేటీకి హాజరు కాకూడదని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ సమావేశానికి రావడం లేదని భట్టికి కిషన్‌రెడ్డి ఇవాళ లేఖ రాశారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు. ప్రాధాన్యత కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమనే విషయం మీకు తెలిసిందే. కానీ బీజేపీ ఎంపీలందరికీ నిన్న రాత్రి ఆలస్యంగా ఈ సమాచారం అందింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా మా ఎంపీలందరికీ వారి వారి నియోజకవర్గాల్లో ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. దీంతోపాటు ముందుగా నిర్ణయించిన అధికార, అనధికార కార్యక్రమాల కారణంగా ఈ సమావేశానికి మేం హాజరుకాలేకపోతున్నాం.

అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజ

భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే కాస్త ముందుగానే తెలియజేస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేస్తున్నాం. అని లేఖలో పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ గైర్హాజరు అయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పార్థసారథి, దామోదర్‌రావు, కేతిరెడ్డి సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరికి కూడా ఆహ్వానం వెళ్లనప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో సమావేశానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Related Posts
కుంభమేళాకు బస్సులు రద్దు : ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్: మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ Read more

కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి నకిలీ పోలీస్
Command And Control Centre

మరో ఫేక్‌ ఆఫీసర్‌ బాగోతం వెలుగులోకి మొన్న సెక్రటేరియట్ .. నేడు కమండ్ కంట్రోల్ లో భద్రతా వైఫల్యం హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (CCC) Read more

హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
telangana new highcourt wil jpg

ts-high-court హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, Read more

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ఉద్రిక్తత
వరంగల్ ఎయిర్‌పోర్టు

వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ ఉద్రిక్తత.. సర్వేను అడ్డుకున్న రైతులు హన్మకొండ బ్యూరో, మార్చి 4, ప్రభాత వార్త: మామునూరు ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్ Read more