Telangana Lawset, PG L Set schedule released

తెలంగాణ లాసెట్, పీజీ ఎల్ సెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌: లా కోర్సుల్లో ప్రవేశాలకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక ప్రకటన చేసింది. లాసెట్, పీజీ ఎల్సెట్ నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను శనివారం విడుదల చేసింది. ఫిబ్రవరి 25న నోటిఫికేషన్, మార్చి 1 నుంచి మే 25వ తేదీ వరకు లేట్ ఫీజుతో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. అలాగే.. జూన్ 6న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు.

Advertisements

. టీజీ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యూల్:
. నోటిఫికేషన్ ఫిబ్రవరి 25, 2025.
. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 1, 2025.
. ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఏప్రిల్ 15, 2025
. ఆలస్య రుసుముతో మే 25, 2025
. పరీక్ష తేదీ జూన్ 6, 2025

image

కోర్సులు: మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు. అర్హత- మూడేళ్ల ఎల్‌ఎల్‌బి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం చేయాలనుకునే వారు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://lawcetadm.tsche.ac.in/ను సంప్రదించండి.

Related Posts
రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
Lucknow court summons Rahul Gandhi

రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు.సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు.న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బిగ్ షాక్ Read more

రమేష్ బిధూరిని సస్పెండ్ చేయాలి: సీతక్క డిమాండ్
Ramesh Bidhuri should be suspended.. Seethakka demands

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచిన రమేష్ బిధూరిపై తెలంగాణ మంత్రి సీతక్క Read more

మెక్సికో దేశంలో ఘోర ప్రమాదం
41 Killed in Crash Between

దక్షిణ మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సును చుట్టుముట్టడంతో 41 మంది Read more

మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి
chandrababu daggubati ven

దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులు అయిన నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల Read more

Advertisements
×