Telangana government relieved two IPS officers

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను రిలీవ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇద్దరు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అలాట్ అయినప్పటికీ కొందరు ఐపీఎస్‎లు ఇప్పటికీ తెలంగాణ కేడర్‏లోనే కంటిన్యూ అవుతున్నారు.

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌

వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు

ఈ నేపథ్యంలో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎, అభిషేక్ మహంతిని వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 21) ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

మిగిలిన ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‎పై తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభిషేక్ మహంతి రిలీవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో అభిషేక్ మహంతి రిలీవ్ విషయం ఈసీ చేతిలో ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.

Related Posts
పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
revanth delhi

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తం రూ.446 కోట్ల బకాయిలను Read more

ఏపీ వాలంటీర్ల కీలక నిర్ణయం
volunteers

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు అంతా సీఎంను కలిసేందుకు ఈ నెల 17న అమరావతి రానున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. ఇప్పటివరకూ తమకు పెండింగ్ Read more

రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రయోజనాలు: భట్టి విక్రమార్క
రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రయోజనాలు: భట్టి విక్రమార్క

తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీలను ఏకమయ్యేలా ప్రేరేపించారు. ఆయన చెప్పినట్టు, రాష్ట్ర ప్రయోజనాల Read more

మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు
Harish Rao stakes in Anand

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి హరీష్ రావుపై మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తన ఫోన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *