Telangana government relieved two IPS officers

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను రిలీవ్ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ మేరకు శనివారం (ఫిబ్రవరి 22) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఇద్దరు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అలాట్ అయినప్పటికీ కొందరు ఐపీఎస్‎లు ఇప్పటికీ తెలంగాణ కేడర్‏లోనే కంటిన్యూ అవుతున్నారు.

Advertisements
ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌

వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు

ఈ నేపథ్యంలో తెలంగాణలో పని చేస్తోన్న ఏపీ కేడర్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎, అభిషేక్ మహంతిని వెంటనే ఏపీకి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 21) ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది.

మిగిలిన ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి రిలీవ్‎పై తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అభిషేక్ మహంతి రిలీవ్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీంతో అభిషేక్ మహంతి రిలీవ్ విషయం ఈసీ చేతిలో ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగిలిన ఇద్దరు ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయనున్నారు.

Related Posts
హరీష్ రావుకు హైకోర్టు ఊరట!
హరీష్ రావుకు హైకోర్టు ఊరట!

తెలంగాణ హైకోర్టు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జనవరి 28 వరకు పొడిగించింది. ఈ ఉత్తర్వులో, అతన్ని Read more

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ
PM Kisan Samman పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ

PM Kisan Samman : పీఎం కిసాన్ పథకం అనర్హుల నుంచి రూ. 416 కోట్లు రికవరీ దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ Read more

పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ నటుడు
parthiban met pawan kalyan

తమిళ సినీ నటుడు పార్థిబన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరిలోని జనసేన పార్టీ Read more

సంక్రాంతికి ఊరెళ్తున్నా వారు జాగ్రత్త..పోలీసుల హెచ్చరికలు
pongal

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులు హెచ్చరించారు. పండుగ సందర్భంగా ఎక్కువ మంది గ్రామాలకు వెళ్లడం, Read more

×