Ramadan Festival: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ఉండనుండగా తర్వాత రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. గత ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో బోనాల పండుగ తర్వాతి రోజు, క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు, రంజాన్ పండుగ తర్వాతి రోజు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం
ప్రస్తుత ప్రభుత్వం కూడా దానినే కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఏపీలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక్కరోజే సెలవు ఉండనుంది. ఇక రేపు (మార్చి 28) జమాతుల్-విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కాలేజీలు, స్కూళ్లు యథావిధిగా పని చేయనున్నాయి. రేపు ముస్లిం మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రభావం ఉంటుంది. వరుస పండగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.
మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు
రేపటి నుంచి ఒక్క శనివారం(మార్చి 29) మినహా బుధవారం మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. మిగతా వారికి మార్చి 30 ఉగాదితోపాటు.. ఆదివారం కావడం, తర్వాతి రోజు రంజాన్, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి విద్యార్థులకే కాదు.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా అవకాశం ఏర్పడింది.