Telangana EAPCET Notification today

నేడు తెలంగాణ ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌

ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 (EAPCET) నోటిఫికేషన్‌ మరికాసేపట్లో విడుదల కానుంది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు నోటిఫికేషన్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) వెల్లడించింది. ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

తెలంగాణతోపాటు ఏపీలోని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

ఇప్పటికే ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ను టీజీసీహెచ్‌ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈఏడాది కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, కన్వీనర్‌ కోటా బీటెక్‌ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.

నాన్‌ లోకల్‌ కోటా రద్దు..

ఇప్పటివరకు అమలులో ఉన్న 15 శాతం నాన్‌ లోకల్‌ కోటాను రద్దు కానుంది. కన్వీనర్‌ కోటా సీట్లన్నీ తెలంగాణకు చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్‌ సీట్లను 70 శాతం కన్వీనర్‌ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన గడువు పదేండ్లు గతేడాదితో పూర్తయ్యాయి. దీంతో నాన్‌లోకల్‌ కోటా గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్‌ కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్నాయి.

Related Posts
ఈరోజు జార్ఖండ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ
Rahul Gandhi will visit Jharkhand today

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు (శనివారం) జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రాజధాని రాంచీలోని శౌర్య ఆడిటోరియంలో జరిగే రాజ్యాంగ Read more

ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!
ఇంటి యజమానులకు పన్ను మినహాయింపు!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2025 లో ఇంటి యజమానులకు శుభవార్త లభించింది. కొత్త పన్ను ప్రయోజనాల ప్రకారం, స్వీయ-ఆక్రమిత గృహాలకు Read more

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !
Notices to Patnam Narender Reddy once again!

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. Read more

ఈ రోజు నుంచి మేడారం చిన్న జాతర ప్రారంభం
Medaram small jatara starts from today

రేపు మండమెలిగె పూజలు.. ఎల్లుండి భక్తుల మొక్కుల చెల్లింపు.ఇప్పుడు, వరంగల్‌: ఈ రోజు నుంచి మేడారం చిన్న జాతర ప్రారంభం. ములుగు జిల్లాలోని మేడారంలో ఈరోజు నుంచి Read more