Telangana CM Revanth returns to Hyderabad from Davos

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ శ్రేణులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. సింగపూర్ పర్యటనతో మొదలైన ఈ ప్రయాణం, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సుతో దావోస్‌లో ముగిసింది.

సింగపూర్ పర్యటనలో పలు కంపెనీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం దావోస్‌లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని, ప్రపంచ స్థాయి సంస్థల సీఈవోలు, చైర్మన్లతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో ఈ సమావేశాలు కీలకంగా నిలిచాయి.

ఈ పర్యటన ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత పర్యటనలో రూ. 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకురాగా, ఈసారి నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు సాధించడం రాష్ట్రానికి గొప్ప విజయంగా నిలిచింది. వీటి ద్వారా దాదాపు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. మొత్తం 20 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు ముఖ్యంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో రాష్ట్రానికి కొత్త శక్తిని తెస్తాయని అంచనా వేయబడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఈ పర్యటన తెలంగాణ అభివృద్ధికి మరింత గణనీయమైన తోడ్పాటు అందించింది. భవిష్యత్‌లో ఈ పెట్టుబడుల ప్రభావం రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి రంగాలపై స్పష్టంగా కనిపిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది.

Related Posts
ఏఐ సాంకేతికకు తెలంగాణ మద్దతు
Telangana support for AI technologies

హైదరాబాద్ : స్టార్టప్‌లు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నాయని, సామాజిక ప్రభావాన్ని పెంచే ఏఐ సొల్యూషన్స్‌కు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, Read more

కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్ స్పందన

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతి చెందడం అందరినీ విషాదంలో ముంచేసింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, Read more

ఏపీ ప్రభుత్వం.. వాట్సాప్ ద్వారా మరిన్ని సేవలు
AP government.. More services through WhatsApp

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చిన సేవల సంఖ్య రెండు వందలకు చేరుకుంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పని Read more

డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ సమావేశం
AP Cabinet meeting on 4th December

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం డిసెంబర్ 4వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌ మీటింగ్ హాలులో ఉదయం 11 గంటలకు Read more