India cricket player Gongadi Trisha with Telangana Chief Minikster Revanth Reddy

త్రిషకు తెలంగాణ సీఎం కోటి నజరానా.

అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో తెలంగాణలోని భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష.. అటు బ్యాటింగ్‌లో,ఇటు బౌలింగ్‌లో సత్తా చాటింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన త్రిష.. 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా అద్భుత ప్రదర్శన ఇచ్చింది. 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా త్రిష (309) నిలిచింది. అందులో ఒక సెంచరీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ టోర్నీలో 7 వికెట్లు కూడా తీసింది. ఈ క్రమంలోనే త్రిష… ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచింది.ప్రపంచ కప్ విజయం తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధ్రుతిలకు ఘన స్వాగతం లభించింది. మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు.. క్రికెటర్లకు శాలువాలతో సన్మానం చేశారు. వీరితో పాటు టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌ నౌషిన్‌ అల్‌ ఖదీర్‌, ట్రైనర్‌ షాలినిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేసిన త్రిషను ప్రత్యేకంగా అభినందించారు.

1887930 telanganacmrevanthreddy

అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో భాగమైన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. వివరాలు.. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున ఆయన నివాసంలో క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. త్రిషను శాలువాలతో సత్కరించారు. ఆమె భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు.

Related Posts
కొత్త కారు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్..ధర తెలిస్తే షాకే
mla mynampally rohit

రోహిత్ కొత్త కారును కొనుగోలు చేసిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ తెలంగాణలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రూ.3 కోట్ల విలువైన Read more

రేపు నాంపల్లి కోర్టుకు కేటీఆర్
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

రేపు (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరుకాబోతున్నారు. తనపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఆమెపై పరువు నష్టం దావా Read more

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు ఎందుకంటే?
కోడిపందేలు కేసు.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిపై మరోసారి పోలీసుల నోటీసులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారిన కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. Read more

వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్
వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో భారత ఆటగాళ్ల మధ్య ఆసీస్ ప్లేయర్లతో వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.తాజాగా సిడ్నీ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా యువ Read more