వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్

వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సిరీస్‌లో భారత ఆటగాళ్ల మధ్య ఆసీస్ ప్లేయర్లతో వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.తాజాగా సిడ్నీ టెస్టులో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ సామ్ కాన్స్టాంట్స్ మధ్య జరిగిన ఘర్షణ పెద్ద చర్చకు దారి తీసింది. వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్ ఈ అంశంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, మా అబ్బాయిలను రెచ్చగొడితే, వారూ సమాధానంగా తగిన విధంగా స్పందిస్తారు అంటూ తేల్చి చెప్పారు.సిడ్నీ టెస్టు మొదటి రోజు చివరి ఓవర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బుమ్రా ఆ ఓవర్‌లో ఐదో బంతి వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో,స్ట్రైక్‌లో ఉన్న ఉస్మాన్ ఖవాజా ఇంకా సిద్ధం కాలేదు.ఈ క్రమంలో, నాన్-స్ట్రైక్‌లో ఉన్న సామ్ కాన్స్టాంట్స్ ఏమో అన్నాడు,అది బుమ్రాను అసహనానికి గురిచేసింది.

వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్
వివాదంపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిత్

బుమ్రా కూడా వెంటనే అతని దగ్గరకు వెళ్లి ప్రతిస్పందించాడు. ఇరువురు ఆటగాళ్లు మాటల యుద్ధంలో నిమగ్నమయ్యారు. పరిస్థితి మరింత ముదరకుండా అంపైర్లు జోక్యం చేసుకుని వివాదాన్ని ఆపారు.రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో ఈ ఘటన గురించి మాట్లాడిన రోహిత్ శర్మ తన జట్టు ఆటగాళ్లకు మద్దతు తెలిపారు.మా టీమ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కానీ, ఎవరో వచ్చి రెచ్చగొడితే, వారు అదే రీతిలో సమాధానం ఇస్తారు.మా అబ్బాయిలు సైలెంట్‌గా కూర్చోరు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సామ్ కాన్స్టాంట్స్‌, బుమ్రాతో మాట్లాడిన తీరు వివాదానికి నాంది కావడంతో, ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. బుమ్రా తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలని కొందరు సూచిస్తుండగా, మరికొందరు మాత్రం అతను చేసిన ప్రతిస్పందన సరైనదేనని అభిప్రాయపడ్డారు.ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ జట్టు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆసీస్ ప్లేయర్ల మాటల యుద్ధాలు, ఫీల్డ్ నైతికతలు హద్దు దాటుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు.

Also Read: నీటి సరఫరా సంక్షోభంపై రేవంత్ రెడ్డి

Related Posts
Fakhar Zaman: టెస్టు జ‌ట్టు నుంచి బాబ‌ర్ ఔట్‌.. ఫ‌క‌ర్ జమాన్ పోస్టు వైర‌ల్‌!
babar azam ap photoanjum naveed 103217314 16x9 3 1

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న సంచలన నిర్ణయం—ఇంగ్లండ్‌తో రాబోయే రెండు టెస్టుల సిరీస్‌ కోసం స్టార్ ఆటగాడు, మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను పక్కన పెట్టడంపై Read more

ఇ సారి కప్పు మనదే – IPL 2025 ప్రారంభం మ్యాచ్ | RCB vs KKR
ఇ సారి కప్పు మనదే IPL 2025 ప్రారంభం మ్యాచ్ | RCB vs KKR

IPL 2025 ప్రారంభం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో Royal Challengers Bangalore (RCB) మరియు Read more

న‌లుగురి క్రీడాకారులకు ఖేల్‌ర‌త్న అవార్డులు
న‌లుగురి క్రీడాకారులకు ఖేల్‌ర‌త్న అవార్డులు

ఖేల్ రత్న అవార్డు, అధికారికంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనే పేరుతో ప్రాచుర్యం పొందింది, ఇది భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవ పురస్కారం. Read more

ఇదెక్కడి మ్యాచ్ భయ్యా 2 డబుల్స్ సెంచరీలు
Border Gavaskar Trophy

డిసెంబర్ 26న బాక్సింగ్ డే సందర్భంగా టెస్ట్ క్రికెట్ అభిమానులకు మూడు ఆసక్తికర మ్యాచ్‌లు కిక్కిరిసిన క్షణాలను అందించాయి. మెల్‌బోర్న్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ ప్రారంభమవగా,మరో రెండు Read more