Telangana Cabinet meeting tomorrow.

Telangana Cabinet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ..!

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానున్నది. ఉదయం 9:30 గంటలకు భేటీ అయి రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఉదయం 11:45 నిమిషాలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది రేవంత్ సర్కార్ ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ కావడంతో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Advertisements
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు ఖర్చు చేయనున్నట్టు నిన్ననే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను బడ్జెట్ లో ప్రవేశపెడుతారా..? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు రూ.3.20లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

Related Posts
రాజ్యసభకు కమల్ హాసన్ !
Kamal Haasan to Rajya Sabha!

రాజ్యసభకు కమల్ హాసన్.కమల్ హాసన్ యొక్క రాజకీయ ప్రస్థానం చెన్నై : రాజ్యసభకు కమల్ హాసన్.మక్కల్ నీది మయ్యం చీఫ్, నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు Read more

మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
WhatsApp Image 2024 12 16 at 3.57.13 PM

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని Read more

NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన
NHRC చీఫ్ నియామకంపై కాంగ్రెస్ ఆందోళన

మానవ హక్కుల ప్యానెల్ చీఫ్ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మరియు మల్లికార్జున్ ఖర్గే జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) చైర్‌పర్సన్ Read more

ఆఫ్రికాలో బంగారు గని విరిగిపడి 42 మంది కార్మికుల మృతి
Gold mine collapse kills 42

చైనా కంపెనీ నిర్వహణలో గని ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మాలి ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కుప్పకూలి 42 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×