Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!

Telangana Budget :అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్‌!

తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. సుమారు 3.30 లక్షల కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.

Advertisements

ఏ శాఖకు ఎన్ని కోట్లు?

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బుధవారం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రాజీవ్ యువవికాసం, మహాలక్ష్మీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, మూసీ నదీ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు ఉంటాయని అంచనా.గతకొన్నేళ్లుగా రాష్ట్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే ఒక్క కరోనా ఏడాది మినహా ప్రతి ఏడాది 25వేల కోట్ల నుంచి 35వేల కోట్ల మేర పెరుగుతూ పోయింది.

సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సుమారు 3.30లక్షల కోట్లతో భట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉంటాయన్న టాక్‌ ఆర్ధికశాఖ వర్గాల నుంచి వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

వైద్య ,విద్యా రంగాలకు నిధులు

కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో పాటు కేసీఆర్ కిట్‌ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఇటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి ఉండటంతో.. సుమారు 3వేట కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం, మెట్రో విస్తరణ, ఫ్యూచర్‌ సిటీకి కూడా నిధులు కేటాయించనుంది ప్రభుత్వం. ఈసారి పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌

ఇక పోయినసారి బడ్జెట్‌ 2.91లక్షల కోట్లు కాగా ఈసారి 15శాతం మేర అంటే 3.30లక్షల కోట్లు దాటుతున్నట్లు తెలుస్తోంది.మొత్తంగాఈసారి బడ్జెట్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఆరుగ్యారంటీలకు భారీ నిధులంటూ జరిగిన ప్రచారం బడ్జెట్‌పై అంచనాలు పెంచాయి.

రు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులోభాగంగానే ప్రస్తుతం 2వేలుగా ఉన్న ఆసరా పెన్షన్‌ను కనీసం 3వేలకు పెంచాలని.. అందుకు ఏటా 3వేల నుంచి 4వేల కోట్ల రూపాయల ఖర్చు పెరనున్నట్లు అంచనా వేసింది. అలాగే.. మహాలక్ష్మీ పథకాన్ని.. దానికయ్యే ఖర్చును ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా ప్రకటించిన రాజీవ్‌ యువవికాసం పథకానికి కూడా కేటాయింపులుండే ఛాన్స్‌ ఉంది. వీటన్నింటికీ తోడు ఇందిరమ్మ ఇళ్లకు భారీగానే నిధులు కేటాయించనుంది రేవంత్‌ సర్కార్.

Related Posts
వివేకా హత్య సాక్షుల మృతిపై సిట్ ఏర్పాటు
ys viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల మరణం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన సాక్షుల్లో ఒకరైన వాచ్‌మెన్ రంగన్న Read more

ప్రయాణికులకు శుభవార్త.. డబ్బులు చెల్లించకుండా రైలు టిక్కెట్
indian railways

దేశంలో భారతీయ రైల్వే సంస్థ కోట్ల మంది ప్రయాణికులను రోజూ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. దశాబ్ధాలుగా తక్కువ ఖర్చులో దూర ప్రయాణాలు చేసేందుకు ఈ ప్రభుత్వ సంస్థ Read more

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు – సీఎం రేవంత్
cm revanth ryathu sabha

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు Read more

ట్రంప్ రెండవ కాలంలో వైట్ హౌస్‌లో మొదటి రోజు: కీలక నిర్ణయాలు
Trump final 1

డొనాల్డ్ ట్రంప్ తన రెండవ కాలంలో వైట్ హౌస్‌లో తిరిగి చేరినప్పుడు, ఆయన అనేక కఠినమైన చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతారని అంచనాలు ఉన్నాయి. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×