హైదరాబాద్: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు బార్ కౌన్సిల్ (Telangana Bar Council) చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి (Chairman A. Narasimha Reddy) బుధవారం వెల్లడించారు. ఒకవేళ న్యాయవాదులు మృతి చెందితే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామని చెప్పారు. అలాగే న్యాయవాదులకు వచ్చే ఆరోగ్య భీమాను రూ.5 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
అక్టోబర్ నుంచి బార్ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు
ప్రభుత్వం గతంలో న్యాయవాదులకు హామీ ఇచ్చిన రూ.100 కోట్లు వెంటనే చెల్లించాలని బార్ కౌన్సిల్ (Telangana Bar Council) చైర్మన్ నరసింహా రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం సహకరించాలని విజప్తి చేశారు. ఇదిలా ఉండగా 35 సంవత్సరాల పైబడిన ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులందరికీ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్లో (Advocate Welfare Association) చోటు కల్పిస్తామని ఈ సందర్భంగా నరసిం హారెడ్డి తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బార్ కౌన్సిల్ కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, బార్ కౌన్సిల్ జాతీయ సభ్యులు విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
తెలంగాణ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదుల నమోదు
తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా తెలంగాణ బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి. ఇది భారత బార్ కౌన్సిల్ చట్టం, 1961 ప్రకారం జరిగే ప్రామాణిక ప్రక్రియ.
బార్ కౌన్సిల్ అని ఎందుకు అంటారు?
లాయర్ బోర్డును బార్ కౌన్సిల్ అని ఎందుకు అంటారు? మీరు ఏదైనా కోర్టు గదికి వెళితే , న్యాయవాదుల సిట్టింగ్ ఏర్పాట్లు సాక్షులు లేదా కోర్టులోని ఇతర ప్రేక్షకులకు భిన్నంగా ఉన్నాయని మీరు కనుగొంటారు
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandi Sanjay: విద్యార్థులకు మోడీ కిట్స్ -సైకిళ్లు పంపిణి చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్