తెలంగాణ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’(Telangana Rising – 2047) కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు పెరుగుతోంది. తాజాగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్(Tony Blair)ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ‘తెలంగాణ రైజింగ్’ అభివృద్ధి ప్రణాళికలు, దీని లక్ష్యాలు, అమలు వ్యూహాలను బ్లెయిర్‌తో పంచుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి గల విస్తృత దృక్పథాన్ని బ్లెయిర్ కొనియాడినట్లు సమాచారం.
మైక్రోప్లానింగ్, ఫ్యూచర్ సిటీపై చర్చలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్ అర్బన్, పెరి-అర్బన్, గ్రామీణ ప్రాంతాలపై మైక్రోప్లానింగ్ పద్ధతిలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించిందని సీఎం రేవంత్ వివరించారు. ఈ విధానంలో సమగ్ర ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఉంది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీలు, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటుపై టోనీ బ్లెయిర్ ఆసక్తి కనబర్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశాలపై ఆయనే స్వయంగా సూచనలు కూడా ఇచ్చినట్టు తెలిసింది.
బ్లెయిర్ సంస్థతో కలిసి ముందుకు
టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలోని సంస్థను ‘తెలంగాణ రైజింగ్ విజన్ డెవలప్మెంట్’లో భాగస్వామిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల అంతర్జాతీయ సలహాదారుల సహకారంతో రాష్ట్రానికి ఒక క్లియర్ డెవలప్మెంట్ బ్లూప్రింట్ సిద్ధమవుతుందని CMO స్పష్టం చేసింది. టోనీ బ్లెయిర్ సంస్థతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణలో ప్రగతిశీలత, సమగ్ర అభివృద్ధికి ఊతమందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Law Set Results : లా సెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ ఎమ్మెల్యే