Technical problem on Instagram.. disruption in services

Instagram: ఇన్‌స్టాలో సాంకేతిక సమస్య.. సేవల్లో అంతరాయం

Instagram : ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థకు చెందిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టాగ్రామ్‌ ‘ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా అమెరికాలో చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. గురువారం సాయంత్రం (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి లాగిన్‌, సర్వర్‌ కనెక్షన్‌ వంటి సమస్యలు తలెత్తాయి.

Advertisements
ఇన్‌స్టాలో సాంకేతిక సమస్య సేవల్లో

యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు

ప్రముఖ టెక్ ట్రాకింగ్ వెబ్ సౌట్ డౌన్‌ డిటెక్టర్‌ ప్రకారం 72 శాతం శాతం కంటే ఎక్కువ మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలో సమస్యలు ఎదుర్కోగా.. 24 శాతం మంది సర్వర్‌ కనెక్షన్‌ ప్రాబ్లమ్‌ను నివేదించారు. దీంతో యూజర్లు అసౌకర్యానికి గురయ్యారు. తమకు కలిగిన అంతరాయాన్ని పలువురు ఇన్‌స్టా యూజర్లు మరో సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ ద్వారా పంచుకున్నారు. అయితే, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై మెటా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం

ఇక, ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు చెందిన ‘ఎక్స్’ (X) డౌన్ అయిన విషయం తెలిసిందే. ఒకేరోజు మూడుసార్లు ఎక్స్ సేవల్లో అంతరాయం కలగడం గమనార్హం. తమ సామాజిక మాధ్యమంపై అతిపెద్ద సైబర్‌ దాడి జరిగిందని మస్క్‌ పేర్కొన్నారు. దీని వెనక భారీ వనరులతో కూడిన పెద్ద గ్రూప్‌ లేదా ఒక దేశ హస్తం ఉందన్నారు. ఈక్రమంలోనే దీని వెనక ఉక్రెయిన్ హస్తం ఉండొచ్చని మస్క్‌ అనుమానాలు వ్యక్తంచేశారు. సైబర్‌ దాడికి పాల్పడిన ఐపీ అడ్రస్‌లు ఉక్రెయిన్‌ ప్రాంతానికి చెందినవేనని తెలుస్తోందన్నారు.

Related Posts
మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారు : ఎమ్మెల్సీ కవిత
Women are losing out politically.. MLC Kavitha

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ Read more

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు – సీఎం రేవంత్
cm revanth ryathu sabha

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదన్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని మ‌హబూబ్ న‌గ‌ర్ రైతు Read more

Modi : నేడు థాయ్లాండ్ పర్యటనకు ప్రధాని
Narendra Modi :ఈ నెల 6న రామేశ్వరంకు వెళ్లనున్న మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి రెండు రోజుల పాటు థాయ్లాండ్ పర్యటనను ప్రారంభిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన థాయ్‌లాండ్ ప్రధాని షినవత్రాతో భేటీ కానున్నారు. Read more

గాజా అమ్మకానికి లేదు: హమాస్
గాజా అమ్మకానికి లేదు: హమాస్

గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం ప్రతిపాదించారు. స్ట్రిప్‌ను అభివృద్ధి చేసి, దానిని 'రివేరా ఆఫ్ మిడిల్ ఈస్ట్'గా Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×