కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘సిమ్ బైండింగ్ రూల్’ డిజిటల్ కమీునికేషన్ భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో వచ్చినప్పటికీ, ఈ నిబంధన వల్ల కొందరు వాట్సాప్(Whatsapp) వినియోగదారులకు అసౌకర్యాలు తప్పనట్టే కనిపిస్తున్నాయి. ఈ కొత్త ప్రకారం, యాప్ ఏ నంబర్‌కి లింక్ అయి ఉంటే, ఆ సిమ్ తప్పనిసరిగా మొబైల్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అంటే, నంబర్ యాక్టివ్‌గా లేకపోతే లేదా సిమ్ ఫోన్‌లో లేకపోతే యాప్ పనిచేయదు.
Read Also: HYD: హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..

ఫారిన్ ట్రిప్స్ వెళ్లే చాలా మంది తమ ఇండియన్ సిమ్ ఆఫ్‌లో ఉంచి, అక్కడి స్థానిక నెట్‌వర్క్ లేదా వైఫై ద్వారా వాట్సాప్ వాడుతుంటారు. కానీ ఇప్పుడు సిమ్ ఫోన్‌లో లేకుంటే యాప్ పని చేయకపోవడం వల్ల వారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారనుంది.
ఆఫీస్ నంబర్‌తో యాప్ వాడేవారికి అదనపు ఇబ్బంది
ప్రస్తుతం చాలామంది తమ ఆఫీస్ నంబర్‌తో లింక్ అయిన వాట్సాప్(Whatsapp) అకౌంట్‌ను ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఇతర ఫోన్లలో కూడా మల్టిపుల్ డివైజ్‌లలో వాడుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం:
- వెబ్ వెర్షన్లు ప్రతి 6 గంటలకు ఆటో లాగౌట్ అవుతాయి
- మళ్లీ రీ-లాగిన్ కావాల్సి వస్తుంది
- చాట్స్ రీ-సింక్ కావడానికి టైమ్ ఎక్కువ పడుతుంది
ఇలా మల్టిపుల్ డివైజ్‌లలో పనిచేసే యూజర్లకు ఇది సమయపరంగా ఇబ్బందికరమైన ప్రక్రియగా మారనుంది. స్పామ్, నకిలీ అకౌంట్‌లు, OTP మోసాలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ రూల్‌ను తీసుకొస్తోంది. అయితే, దీనివల్ల నిజాయితీగా యాప్ వాడే యూజర్లు కూడా అనవసరమైన నియంత్రణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: