हिन्दी | Epaper

WhatsApp: వాట్సాప్‌లో అదిరే ఫీచర్ వచ్చేసింది.. మీకు తెలుసా?

Anusha
WhatsApp: వాట్సాప్‌లో అదిరే ఫీచర్ వచ్చేసింది.. మీకు తెలుసా?

వాట్సాప్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ఈ యాప్ ద్వారా మెసేజ్‌లు పంపించుకుంటూ, సమాచారాన్ని పంచుకుంటున్నారు. అయితే మనం ఈ యాప్‌ను ఎంతగా ఉపయోగిస్తున్నా, కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన సందేశాలను మిస్ అవుతాం. బిజీ షెడ్యూల్ (Busy schedule), ఒత్తిడితో కూడిన పనుల కారణంగా, చదివిన మెసేజ్‌లకు వెంటనే రిప్లై ఇవ్వడం అసాధ్యమవుతుంది. అలా రిప్లై ఇవ్వకపోతే, ఆ మెసేజ్ మర్చిపోతాం. అలాంటి సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ తాజాగా తీసుకువచ్చిన కొత్త ఫీచర్”రిమైండ్ మీ”.

రిమైండ్ మీ ఫీచర్ విశేషాలు

ఈ “రిమైండ్ మీ” ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.25.21.14 లో అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు ఒక ప్రత్యేక మెసేజ్‌ (Special message) కి సంబంధించిన రిమైండర్‌ను సెట్ చేసుకోవచ్చు. మీరు చదివిన ఒక ముఖ్యమైన మెసేజ్‌కి రిప్లై ఇవ్వాలని అనుకున్నా, అది మర్చిపోతే నోటిఫికేషన్ రూపంలో వాట్సాప్ దాన్ని గుర్తు చేస్తుంది. ఫలితంగా మీరు దాన్ని మళ్లీ చదివి, అవసరమైన చర్య తీసుకునే అవకాశం ఉంటుంది.

దీన్ని ఉపయోగించడం ఎలా?

దీన్ని ఉపయోగించడం సులభం. దీని కోసం, మీరు రిమైండర్‌ను సెట్ చేయాలనుకుంటున్న చాట్‌పై ఎక్కువసేపు ప్రెస్ చేయండి. స్క్రీన్ పైభాగంలో బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఒక మెనూ ఓపెన్ అవుతుంది. దీనిలో రిమైండర్ (Reminder) కోసం నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో 2 గంటలు, 8 గంటలు, 24 గంటలు, కస్టమ్ అని ఉంటుంది. అందులో ఏ టైమ్ సెట్ చేసుకుంటే అప్పుడు మీకు వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ రిమైండర్‌ను తీసేయాలనుకుంటే ఆ చాట్‌ను మళ్ళీ ప్రెస్ చేసి, బెల్ ఐకాన్‌పై క్లిక్ చేయడం ద్వారా రిమైండర్‌ను తొలగించవచ్చు.

వాట్సాప్ సీఈఓ ఎవరు?

వాట్సాప్ ప్రస్తుత సీఈఓ విల్ క్యాథ్‌కార్ట్ (Will Cath cart).ఆయన క్రిస్ డేనియల్స్ స్థానంలో ఈ పదవిని చేపట్టారు.

వాట్సాప్ చరిత్ర ఏమిటి?

వాట్సాప్‌ను 2009లో జాన్ కౌమ్ (Jan Koum),బ్రియాన్ ఆక్టన్ (Brian Acton) అనే ఇద్దరు యాహూ మాజీ ఉద్యోగులు స్థాపించారు.

Read Hindi News : hindi.vaartha.com

Read also : UPI : యూపీఐ పేమెంట్ విధానం ఛార్జీలు, అప్‌డేట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870