విజయవాడ: ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించడమే లక్ష్యం రాష్ట్రంలో విద్యుత్ (current) వాహనాలను భారీ ఎత్తున ప్రోత్సహించే దిశలో ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. విద్యుత్తు వాహనాలకు ఇబ్బంది లేకుండా రాయితీపై విద్యుత్తు చార్జింగ్ చేసే కేంద్రాలను అందుబాటులోకి తీసుకుని వస్తుంది. అందులో భాగంగా ఛార్జింగ్ నెట్వర్క్, మౌలిక సదుపాయాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. నెడ్క్యాప్ అధికార వర్గాల సమాచారాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పీఎం ఈ డ్రైవ్ పథకం క్రింద విద్యుత్ బైక్లు, ఆటోలు, కార్లు, బస్సుల కోసం 4,018 ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చేందుకు రూ.385.57 కోట్లతో ప్రాజెక్టును రూపొందించింది. దీని కోసం ఈపీడీసీఎల్ వరిధిలో 628, సీపీడీసీఎల్ పరిధిలో 165, ఎస్పీడీసీఎల్ వరిధిలో 209 లొకేషన్లను గుర్తించింది.
Read also: Mantena Ramaraju: టీటీడీకి మంతెన రామరాజు 9 కోట్ల విరాళం

దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జిoగ్ కేంద్రాల కోసం
ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాలను ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు వెళ్ళాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ భాధ్యతలను నెడ్ క్యాప్ నిర్వహిస్తుంది. ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (ఈవీ పీసీఎస్) మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో డిస్కంలు ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. పీఎం ఈ డ్రైవ్ పథకం క్రింద దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జిoగ్ కేంద్రాల కోసం కొనుగోలు చేసే పరికరాలపై రాయితీలు ఇచ్చేందుకు రూ.2వేల కోట్లు వాహనానికి ఛార్జింగ్ కోసం ప్లగ్ ఇన్ చేసేందుకు అవసరమైన ఈవీ సప్లై ఎక్విప్మెంట్ (ఈవీఎస్ఈ) కు కేంద్రం పలు రాయితీలు నిర్దేశించింది. డిస్కంలు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే వాటిని ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల(సీపీఓ) ద్వారా నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
2011 జనాభా లెక్కల ఆధారంగా
సీపీవోలు ఛార్జింగ్ సేవలు వినియోగించుకున్న వారి నుంచి యూనిట్కు రూ.15 చొప్పున వసూలు చేస్తారు. అందులో కొంత మొత్తాన్ని డిస్కంలకు చెల్లించాలి. ఈ ప్రక్రియ టెండరు ద్వారా నిర్వహించనున్నారు. పట్టణాలు, జాతీయ రహదారుల వెంట వాహనాలు నిలిపేందుకు అనువైన ప్రాంతాల్లోనే ఛార్జింగ్ స్టేషనన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 10 లక్షలకు పైగా జనాభా ఉండాలి. స్మార్ట్ సిటీల కింద ఇప్పటికే కేంద్రం గుర్తింపు క్రింద రాష్ట్ర రాజధాని నగరం జాతీయ శుద్ద గాలి పథకం (ఎన్సీఏపీ) కింద ఎంపికైన పట్టణాలు వాటితో పాటు అర్హత కల్గిన సంస్థలు వాటి అవసరాలకు అనుగుణంగా ఇతర నగరాల్లో ఈవీ
పీసీఎస్ ఏర్పాటు చేయచ్చు. రాష్ట్ర, అంతరాష్ట్ర రహదారుల వెంట ఈవీ కేంద్రాలు ఏర్పాటుకూ కేంద్రం అనుమతిస్తుంది. టోల్ట్లోని వాహనాల సంఖ్య ఆధారంగా ఎక్కువ రద్దీ ఉండే రహదారులు, పెద్ద నగరాలు, పారిశ్రామిక హబ్లు, పోర్టులకు అనుసంధానంగా ఉన్న హైవేలపై ఏర్పాటు చేయచ్చు. డిస్కంలు ప్రతిపాదించిన ఛార్జింగ్ కేంద్రాలను పరిశీలిస్తే ద్విచక్ర/ ఆటోలు 2,371 కేంద్రాలు ఉన్నాయి, కార్లు 1,512 కేంద్రాలు విద్యుత్ బస్సులు/ ట్రక్కులు 135 కేంద్రాలు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: