Whatsapp-ఇటీవల వాట్సాప్ వెబ్ వినియోగదారులు సాంకేతిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లాగిన్ సమస్యలతో(login problems) పాటు, పేజీ స్క్రోలింగ్ సరిగా పనిచేయకపోవడం వలన వర్క్ చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలు కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని యూజర్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. పేజీని రిఫ్రెష్ చేస్తే కొంత సమయం పని చేసినా, తర్వాత మళ్లీ అదే సమస్య వస్తోందని పలువురు చెబుతున్నారు.

యూజర్ల ఫిర్యాదులు పెరుగుతున్నాయి
సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 1:10 గంటల ప్రాంతంలో మొదలైన ఈ సమస్య 1:55 గంటల వరకు కొనసాగింది. దాదాపు 290 మంది యూజర్లు ఫిర్యాదులు(User complaints)నమోదు చేశారు. వీటిలో 54 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలు, 24 శాతం వెబ్‌సైట్ యాక్సెస్ ఇబ్బందులు, 22 శాతం యాప్ వినియోగ సమయంలో వచ్చిన సమస్యలు.
ఇదిలా ఉండగా, వాట్సాప్ తాజాగా iOS మరియు iPadOS పరికరాల్లో ఉన్న ఒక భద్రతా లోపాన్ని సరిచేసింది. ఈ బగ్ కారణంగా హ్యాకర్లు ఆపిల్ పరికరాల నుంచి వ్యక్తిగత డేటాను దోచుకునే అవకాశముందని ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడైంది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక అప్‌డేట్ విడుదల చేసింది. మరికొందరు యూజర్లు వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు తక్కువయ్యాయని చెబుతున్నారు. అయితే వాట్సాప్ మరియు మెటా ఈ సమస్యలపై అధికారికంగా ఇంకా స్పందించలేదు.
వాట్సాప్‌లో సమస్యలు ఎప్పుడు మొదలయ్యాయి?
సెప్టెంబర్ 8న మధ్యాహ్నం 1:10 ప్రాంతంలో మొదలయ్యాయి.
ఎక్కువగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?
సర్వర్ కనెక్షన్ సమస్యలు 54% ఫిర్యాదులుగా నమోదయ్యాయి.
Read hindi news:hindi.vaartha.com
Read also: