AI: తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)(Artificial intelligence) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాకు చెందిన డికన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో డికన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)పై సంతకాలు చేశారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. ఇది కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదని, భవిష్యత్తులో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు దిక్సూచిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

యువతకు ఏఐ కోర్సులు, స్టార్టప్‌లకు మార్గదర్శనం
తెలంగాణ నుండి ప్రపంచానికి అత్యంత నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులను రూపొందించి, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తాయని తెలిపారు. తెలంగాణలోని ఏఐ స్టార్టప్‌లు(AI startups) ప్రపంచ మార్కెట్‌లో రాణించేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తారని ఆయన వెల్లడించారు. ఏఐని కేవలం సాంకేతికతగా కాకుండా, సమ్మిళిత వృద్ధికి, మానవాభివృద్ధికి శక్తివంతమైన సాధనంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం ఒప్పందం చేసుకుంది?
ఆస్ట్రేలియాకు చెందిన డికన్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం చేసుకుంది.
ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధాన లక్ష్యం ఏమిటి?
ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వడం మరియు ఏఐ స్టార్టప్‌లకు మార్గదర్శనం చేయడం.
Read hindi news:hindi.vaartha.com
Read also: