సోషల్ మీడియా వేదికలపై ప్రస్తుతం ఒక కొత్త ఫోటో ఎడిటింగ్ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. “జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చీర” పేరిట అందరినీ ఆకర్షిస్తున్న ఈ ఫీచర్ గూగుల్ జెమినీ నానో బనానా అనే ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ఆధారంగా పనిచేస్తోంది. 90వ దశకంలోని పాతకాలపు అందాన్ని ఆధునిక టెక్నాలజీ (AI) తో మిళితం చేస్తూ యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ఈ సౌకర్యం ద్వారా నేటి యువత, మధ్యవయస్కులు కూడా తమ పాత జ్ఞాపకాలను మళ్లీ బతికించుకుంటున్నారు.
ఈ టూల్ వినియోగం చాలా సులభం. యూజర్ తన ఫోటోను అప్లోడ్ చేసి, 1990ల శైలి చీరలు, క్లాసిక్ బ్యాక్‌డ్రాప్ (Classic backdrop) లతో తాను ఎలా కనపడాలో ఎంపిక చేసుకోవచ్చు. టూల్ ఆటోమేటిక్‌గా పాతకాలపు రంగులు, వాతావరణం, ఫ్రేమ్‌లను జోడించి ఫొటోను రీడిజైన్ చేస్తుంది. ఈ సృజనాత్మకతతో నిండిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికలలో షేర్ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా “నానో బనానా” అనే పదమే ట్రెండింగ్ అవుతుంది.
డిజిటల్ ఫార్మాట్‌లో తిరిగి మన ముందుకు వస్తున్నాయి
పాతకాలపు గ్లామర్‌ను అందంగా రీక్రియేట్ చేస్తోన్న ఈ టూల్‌లో కొత్తగా చీరలు, జ్ఞాపకాల పక్కన ఆధునిక లైట్ ఎఫెక్ట్స్, మోడర్న్ టెక్స్చర్లు కూడా జోడించవచ్చు. ఈ కాంబినేషన్ యూజర్లకు నిజంగా ప్రత్యేకమైన అనుభూతి ఇస్తోంది. ఫోటోషాప్, స్నాప్‌చాట్ వంటి సాధారణ యాప్‌లను మించి, ఈ టూల్ కేవలం ఒక క్లిక్‌తోనే ఫోటోలను పాత కాలపు లుక్‌లోకి మార్చేస్తోంది.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ (YouTube) షార్ట్స్‌లో కూడా ఈ ట్రెండ్‌ని అనుసరించే వీడియోలు విపరీతంగా వస్తున్నాయి. కొంతమంది తమ పెళ్లి ఫోటోలను, కొంతమంది బాల్య ఫోటోలను ఈ టూల్‌లో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఇలా పాత జ్ఞాపకాలు కొత్త డిజిటల్ ఫార్మాట్‌లో తిరిగి మన ముందుకు వస్తున్నాయి.. తాజాగా, ఈ ట్రెండ్‌పై దివంగత రతన్ టాటా (Ratan Tata) స్నేహితుడు, తెలుగు యువకుడు శంతను నాయుడు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
ఏఐతో ఫొటోలు చేసుకుని ఆనందపడుతున్నారా?’
‘మీరంతా ఉన్నది భారత్‌లో.. అమెరికాలో కాదు? ఈ దేశం చీరలకు పుట్టినిల్లు..మీ బీరువాల్లో చూసుకుంటే కనీసం 15 చీరలు కనిపిస్తాయి.. వాటిని కుట్టుకుని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పంచుకోవచ్చు కదా.. ఈ మాత్రం కూడా చేయలేనంత బద్ధకస్తులుగా తయారయ్యారా? మీ కబోర్డుల్లో దుస్తులను కాదని ఏఐతో ఫొటోలు చేసుకుని ఆనందపడుతున్నారా?’ అని రతన్ టాటా సన్నిహితుడు శంతను నాయుడు (Shantanu Naidu) విమర్శలు గుప్పించారు.
పాశ్చాత్య దేశాల్లో వివాహా సమయంలో ధరించే తెల్లటి గౌన్లు వేసుకున్నట్టు ఫొటోలు ఎడిట్ చేసి షేర్ చేసినా అంతగా తప్పుబట్టాల్సి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఇటువంటి కంటే ఇంట్లో అమ్మ చీర కట్టుకుని ఫొటోలు దిగితే మరింత అందంగా కనిపిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
టూల్ సాయంతో దేశంలో చీరల ఎడిట్స్ పాప్యులర్‌గా మారాయి
ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో శంతను నాయుడు పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. తమ మనసులో ఏముందో శంతను అదే చెప్పారని కామెంట్ పెడుతున్నారు. గూగుల్ ఏఐ జెమినీ నానో బనానా ఇమేజ్ ఎడిటింగ్ టూల్ (Google AI Gemini Nano Banana Image Editing Tool) ట్రెండింగ్ క్రియేట్ చేస్తోంది.
సాధారణ ఫోటోలకు త్రీడీ హంగులు అద్దే ఈ టూల్ ప్రస్తుతం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టూల్ సాయంతో దేశంలో చీరల ఎడిట్స్ పాప్యులర్‌గా మారాయి. తమ ఫొటోలను 90 దశకం నాటి శైలిలో ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.కాగా, నానో బనానా ఫోటో ఎడిటింగ్ టూల్‌పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) హెచ్చరించారు. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సజ్జనార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. గత నెలలోనే గూగుల్ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Read Also: