దేశంలోని దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC)కు సంబంధించిన ఒక కేసులో కంపెనీకి రూ. 56.44 కోట్ల జరిమానా విధిస్తూ అహ్మదాబాద్‌లోని సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) జాయింట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తమకు గురువారం ఉదయం ఈ-మెయిల్ ద్వారా అందినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. సెంట్రల్ జీఎస్టీ చట్టం, 2017లోని సెక్షన్ 74 కింద ఈ పెనాల్టీని విధించారు.
Read Also: Vikram – 1: ఇండియన్ ఫస్ట్ కమర్షియల్ ఆర్బిటాల్ రాకెట్..హైదరాబాద్ ఘనత

అధికారుల నిర్ణయాన్ని తప్పుబట్టిన రిలయన్స్
అయితే, జీఎస్టీ అధికారుల ఈ నిర్ణయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పుబట్టింది. సేవల ప్రదాత (సర్వీస్ ప్రొవైడర్) అందించిన సేవల వర్గీకరణను అధికారులు సరిగ్గా పరిగణనలోకి తీసుకోకుండానే, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను బ్లాక్డ్ క్రెడిట్‌గా పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నారని కంపెనీ ఆరోపించింది. అధికారుల ఉత్తర్వుల్లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ జరిమానా ఉత్తర్వులను సవాలు చేస్తూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: