దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్‌లలో మ్యాగీకి(Maggi Capsule) ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇది అనేక కుటుంబాల రోజువారీ జీవనంలో భాగమైంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ‘మ్యాగీ క్యాప్సూల్’ అంటూ కొన్ని వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి.
Read Also: ChatGPT 5.2: గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2.. దీనిలో కొత్తగా ఏముంది?

వైరల్ వీడియోల్లో చూపించింది ఏంటంటే…
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన వీడియోల్లో ఒక వ్యక్తి మ్యాగీ(Maggi Capsule) లోగో ఉన్న పసుపు రంగు క్యాప్సూల్‌ను చూపిస్తాడు. దాన్ని మరిగే నీటిలో వేసిన వెంటనే నూడుల్స్, మసాలా బయటకు వచ్చి మ్యాగీలా తయారవుతున్నట్లు చూపించారు. మరో వీడియోలో ఓ మహిళ కూడా ఇదే పద్ధతిలో మ్యాగీ తయారు చేసి, రుచి కూడా అసలైన మ్యాగీలా ఉందని చెబుతుంది.
నిజమా అని నమ్మిన నెటిజన్లు.. కానీ అది కట్టుకథే!
ఈ వీడియోలు చూసిన చాలామంది మ్యాగీ నిజంగానే కొత్త క్యాప్సూల్ ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిందేమోనని ఆశ్చర్యపోయారు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో తయారు చేసిన ఫేక్ వీడియోలని తేలింది.
మ్యాగీ ఇండియా సరదా స్పందన.. నెటిజన్లే బయటపెట్టిన లోపాలు
ఈ అంశంపై మ్యాగీ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్పందిస్తూ, “ఇతర నెలల్లో ఏప్రిల్ ఫూల్ డే జరపొద్దు” అంటూ హాస్యంగా కామెంట్ చేసింది. అలాగే కొంతమంది నెటిజన్లు వీడియోల్లోని లోపాలను గుర్తించారు. ఒక వీడియోలో ఫోర్క్ అసహజంగా వంగిపోవడం, మరొకటిలో మనిషి కదలికలు సహజంగా లేకపోవడం గమనించి ఇవి ఏఐతో తయారైనవని తేల్చారు. దీంతో ‘మ్యాగీ క్యాప్సూల్’ కథ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: