ఉద్యోగ ఇంటర్వ్యూల్లో(Interview Fraud) ఇప్పుడు కొత్త తరహా మోసం బయటపడుతోంది. అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారని కంపెనీలు గుర్తించాయి. ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నలకు వెంటనే AI చాట్‌బాట్ నుంచి వచ్చిన ప్రాంప్ట్‌ని స్క్రీన్‌పై చదివి సమాధానం చెబుతున్న ఘటనలు పెరిగాయి.
Read Also: Delhi Blast Updates: ఢిల్లీలో పేలుడు కలకలం.. బాధితుల లిస్ట్

కంపెనీల స్మార్ట్ స్ట్రాటజీ
ఇలాంటి మోసాలను గుర్తించేందుకు కొన్ని సంస్థలు కొత్త టెక్నిక్స్ అమలు చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు అభ్యర్థులు సమాధానం చెప్పేటప్పుడు “కళ్లను మూసుకుని చెప్పండి” అని అడుగుతున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా వారు స్క్రీన్‌పై ఉన్న AI సమాధానాన్ని చదువుతున్నారో లేదో సులభంగా గుర్తించవచ్చు. AI టూల్స్ వాడటం వల్ల అభ్యర్థుల అసలైన నైపుణ్యాలు బయటపడటం లేదని రిక్రూటర్లు ఆందోళన వ్యక్తం(Interview Fraud) చేస్తున్నారు. టెక్నాలజీ ఆధారంగా ఇలాంటి చీటింగ్ చేయడం వల్ల నిజమైన ప్రతిభ కలిగిన అభ్యర్థులు వెనుకబడే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు.
నెటిజన్ల సూచనలు
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు AI సహాయం మీద ఆధారపడకుండా స్వంతంగా స్కిల్స్ పెంపొందించుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. “ఇంటర్వ్యూలో తాత్కాలికంగా విజయం సాధించినా, ఉద్యోగంలో నైపుణ్యం లేకపోతే నిలబడలేరు” అని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కంపెనీలు ఇప్పుడు AI ప్రాంప్ట్ వాడకాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌లు మరియు కెమెరా ట్రాకింగ్ సిస్టమ్స్ను కూడా ప్రవేశపెడుతున్నాయి. భవిష్యత్తులో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో AIని సమతుల్యంగా ఉపయోగించాలన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: