ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగంలో ఇన్‌స్టాగ్రామ్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. రోజు రోజుకీ దీని వినియోగదారుల సంఖ్య పెరుగుతూ, యూజర్ల ఆసక్తిని పుట్టించే రకరకాల ఫీచర్లను పరిచయం చేస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా Instagram Reels అయితే యువత నుండి వృద్ధుల వరకూ అందరికీ అభిరుచికరంగా మారాయి. ఒక్కసారి రీల్స్ ఓపెన్ చేస్తే, గంటల తరబడి స్క్రోల్ చేస్తూ చూసేస్తూ ఉండిపోతుంటారు. అయితే అదే సమయంలో యూజర్ల ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.చాలా మంది రాత్రి పడుకునే సమయానికైనా, ఇంస్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ కాలం గడుపుతుంటారు. దీనివల్ల చేతికి నొప్పులు రావడం, చూపు మచ్చిక కాదవడం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గతకొన్ని రోజులుగా ఫేస్‌బుక్, ఎక్స్‌లలో చాలా మంది ఆటో స్క్రోల్‌కు సంబంధించి పోస్టులు చేస్తున్నారు.
ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటో స్క్రోల్ అనే కొత్త ఆప్షన్ వస్తుందంటూ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మీరు రీల్స్‌ను చేయితో స్క్రోల్ చేయవలసిన అవసరం లేదు. రీల్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్లే అవుతూనే ఉంటాయి. సేమ్ నెట్‌ఫ్లిక్స్ ఆటో ప్లే ఫీచర్ (Netflix auto play feature) లాగా ఇది పనిచేస్తుంది. రీల్స్ ఎక్కువగా చూసేవారికి ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా వెల్లడించలేదు. చర్చ మొత్తం సోషల్ మీడియాలోనే జరుగుతుంది. ఇన్‌స్టాగ్రామ్ నిజంగా ఆటో స్క్రోల్ ఫీచర్‌ను తీసుకువస్తే, అది ప్రజల ఆరోగ్యానికి మరింత హానికరం కావచ్చు.

ఫీచర్ తీసుకొస్తే
దీని వలన స్క్రీన్ సమయం పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్, ఒత్తిడి, పిల్లలు, యువకులలో సోషల్ మీడియా వ్యసనం పెరిగే అవకాశాలు ఉన్నాయి.ఈ ఫీచర్ కు సంబంధించి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఇన్‌స్టా అలాంటి ఫీచర్ (Feature) తీసుకొస్తే, అది సోషల్ మీడియా చరిత్రలో అతిపెద్ద చెత్త ఫీచర్‌గా నిలుస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని అసలు ఈ ఫీచర్ తీసుకరావాల్సిన అవసరం ఏంటీ..? అని ప్రశ్నిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్ యజమాని ఎవరు?
ఇన్‌స్టాగ్రామ్‌ను 2010లో కెవిన్ సిస్ట్రోమ్ (Kevin Systrom) మైక్ క్రిగర్ (Mike Krieger) అనే ఇద్దరు cofounders రూపొందించారు.
ఇన్‌స్టాగ్రామ్ ప్రధాన ప్రయోజనం ఏమిటి?
ఇన్‌స్టాగ్రామ్ అనేది ఉచిత ఫోటో, వీడియో షేరింగ్ యాప్. దీని ప్రధాన ప్రయోజనం ఏమంటే,వినియోగదారులు తమ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసి, తమ ఫాలోవర్స్‌కి లేదా ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్నేహితులకు షేర్ చేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Solar Eclipse : మరో రెండేళ్లలో అరుదైన సూర్యగ్రహణం