ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఓపెన్‌ఏఐ (OpenAI) తాజాగా తీసుకొచ్చిన అభివృద్ధి టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. “జీపీటీ-5” (GPT-5) పేరిట విడుదలైన ఈ సరికొత్త ఏఐ మోడల్ గురువారం అధికారికంగా ప్రకటించడంతో టెక్నాలజీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగించగలిగే విధంగా, దీన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ఇది ఇప్పటికే ఉన్న GPT-4 మోడల్ కన్నా శక్తివంతమైనదిగా, మరింత చింతన సామర్థ్యం, సహజమైన సంభాషణ నైపుణ్యాలు, బహుభాషా అవగాహన కలిగిన మోడల్‌గా రూపొందించబడిందని కంపెనీ తెలిపింది.GPT-5 మోడల్ విడుదలతో ఓపెన్‌ఏఐ మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షించగా, మరోవైపు ఈ ప్రకటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ స్పందించిన తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
హెచ్చరిక స్వభావం
“ఓపెన్‌ఏఐ… మైక్రోసాఫ్ట్‌ను బతికుండగానే మింగేస్తుంది” అని మస్క్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్య మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఉద్దేశించిందని టెక్ వర్గాల్లో భావిస్తున్నారు. ఈ ట్వీట్ వెనుక ఉన్న వ్యంగ్యం, హెచ్చరిక స్వభావం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చకు దారితీసింది.జీపీటీ-5 విడుదలపై ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ (OpenAI CEO Sam Altman) మాట్లాడుతూ, ఇది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) దిశగా వేసిన అతిపెద్ద ముందడుగు అని అభివర్ణించారు. జీపీటీ-3ని ఒక హైస్కూల్ విద్యార్థితో, జీపీటీ-4ని కాలేజీ విద్యార్థితో పోల్చిన ఆయన, జీపీటీ-5 ఒక పీహెచ్‌డీ స్థాయి నిపుణుడితో సమానమని అన్నారు. దీని సామర్థ్యం చూసి తాను భయపడ్డానని, ఇది ఒకరకంగా ‘మాన్‌హాటన్ ప్రాజెక్ట్’ లాంటి క్షణమని వ్యాఖ్యానించారు. తాను పరిష్కరించలేకపోయిన ఒక క్లిష్టమైన సమస్యను జీపీటీ-5 సునాయాసంగా పరిష్కరించినప్పుడు, తాను పనికిరానివాడినని అనిపించిందని ఆల్ట్‌మన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏఐ ప్లాట్‌ఫామ్
ఎలాన్ మస్క్ హెచ్చరికపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హుందాగా స్పందించారు. “గత 50 ఏళ్లుగా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఉన్న అసలైన మజా అదే! ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, భాగస్వామ్యాలు, పోటీ అన్నీ ఉంటాయి. మా అజూర్ ప్లాట్‌ఫామ్‌పై గ్రాక్ 4 కోసం ఎదురుచూస్తున్నాం, గ్రాక్ 5 కోసం కూడా ఆసక్తిగా ఉన్నాం” అని నాదెళ్ల బదులిచ్చారు. మైక్రోసాఫ్ట్ తన 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీ వంటి అన్ని ప్రధాన ఉత్పత్తులలో జీపీటీ-5ను అనుసంధానించినట్లు ఆయన ప్రకటించారు.మరోవైపు, తన సొంత ఏఐ ప్లాట్‌ఫామ్ ‘గ్రాక్’ను వెనకేసుకొచ్చిన మస్క్, ఇప్పటికీ ‘గ్రాక్ 4 హెవీ’ మోడలే అత్యంత శక్తిమంతమైనదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ప్రముఖ ఏఐ కోడింగ్ ఎడిటర్ ‘కర్సర్ ఏఐ’ కూడా తమ ప్లాట్‌ఫామ్‌లో జీపీటీ-5ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. తాము పరీక్షించిన వాటిలో ఇదే అత్యంత తెలివైన కోడింగ్ మోడల్ అని తెలిపింది. జీపీటీ-5 ఉచితంగా అందుబాటులోకి రావడంతో ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రరూపం దాల్చింది.
AI ఎలా పనిచేస్తుంది?
AI డేటా ఆధారంగా పనిచేస్తుంది. దీనిలో యంత్రాలకు పెద్ద మొత్తంలో డేటాను అందించి, ఆ డేటాలోని నమూనాలను గుర్తించి, వాటిపై బేస్ అయ్యి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్‌లు వంటి సాంకేతికతల ద్వారా సాధ్యమవుతుంది.
AI భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?
AI భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందుతుంది. ఇది మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.
Read hindi news: hindi.vaartha.com
Read also: