Offers Sales 2025 : ఈ దసరా మీకు బంపర్ ఆఫర్లు రెడీగా ఉన్నాయి. ఒక వైపు మోడీ ప్రభుత్వం కొత్త GST 2.0 రేట్ కట్స్ తో వస్తుంటే, మరో వైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ పైనే (Offers Sales 2025) డిస్కౌంట్లతో దుమ్ము రేపుతున్నాయి. ఇంతలో మనకి లాభం ఏంటి? అసలు ఎక్కడ ఎక్కువ సేవింగ్స్ దొరుకుతాయో తెలుసుకోవాలి కదా!
మొబైల్స్ నుంచి TVs వరకూ, ఫ్యాషన్ నుంచి ఫర్నిచర్ వరకూ, “బిగ్గెస్ట్ ఎవర్ డీల్” బోర్డులు కనిపిస్తున్నా, మన జేబుకి ఏది లాభమో, ఎక్కడ డిస్కౌంట్ నిజంగానే వర్కౌట్ అవుతుందో అదే ముఖ్యం.
ఎందుకంటే, ఆన్‌లైన్ సేల్స్ లో “10% ఆఫ్” అని కనిపించినా, లోపల షరతులు ఉంటాయి. EMIలు “నో-కాస్ట్” అని కనిపించినా, చివరికి GST, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సిందే. తెలివిగా షాపింగ్ చేసే వారు బ్యాంక్ వోచర్స్, రివార్డ్ పాయింట్లతో డబుల్ లాభం పొందుతున్నారు.
మధ్యతరగతి షాపర్‌కు అసలు గేమ్ డిస్కౌంట్‌లో కాదు. మనం ఏ కార్డ్ వాడుతున్నాం, ఎక్కడ లావాదేవీ చేస్తున్నాం, ఆ లెక్కల్లోనే డిస్కౌంట్ ఉంది.
10% డిస్కౌంట్ వివరణ:
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మిన్త్రా 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తాయి, కానీ గరిష్ట పరిమితి ఉంటుంది.
- ఫ్లిప్‌కార్ట్: ICICI, Axis కార్డ్స్ తో 10% డిస్కౌంట్, గరిష్ట రూ. 4,500.
- అమెజాన్: SBI కార్డ్స్ తో 10% డిస్కౌంట్, మొబైల్స్ కు రూ. 1,000, ఇతర వస్తువులకి రూ. 1,500 వరకు.
- మిన్త్రా: HDFC కార్డ్ హోల్డర్స్ కి 10%, గరిష్ట రూ. 750, కనీసం రూ. 3,500 షాపింగ్ కావాలి.
- పెద్ద బిల్లులు: అమెజాన్ బోనస్ డిస్కౌంట్ – రూ. 30,000 బిల్లుపై రూ. 500, రూ. 1 లక్ష దగ్గర రూ. 4,000 వరకు.
వోచర్స్ ద్వారా స్మార్ట్ షాపింగ్:
తెలివైన షాపర్లు డైరెక్ట్ కార్డ్ వాడరు, ICICI iShop, HDFC SmartBuy లాంటి బ్యాంక్ పోర్టల్స్ ద్వారా వోచర్స్ కొనుగోలు చేసి షాపింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే రివార్డ్ పాయింట్లు 18% వరకు రావచ్చు. ఉదాహరణ: అమెజాన్‌లో రూ. 20,000 ఫోన్ SBI కార్డ్ తో కొంటే 1,000 రూపాయల డిస్కౌంట్, కానీ ICICI iShop వోచర్స్ ద్వారా దాదాపు రూ. 3,600 విలువైన రివార్డ్స్ పొందవచ్చు.
నో-కాస్ట్ EMI:
“నో-కాస్ట్ EMI” అని చూసి సింపుల్ గా ఫ్రీ అనుకోవద్దు. ప్రాసెసింగ్ ఫీజులు, GST లు ఉండడం వల్ల చిన్న అదనపు ఖర్చు వస్తుంది. ఉదాహరణకి, అమెజాన్ లో రూ. 98,000 TV 9 నెలల నో-కాస్ట్ EMI తో కొనుగోలు చేస్తే, చివరికి దాదాపు రూ. 1,473 అదనంగా కట్టాలి.
UPI ఆఫర్:
కార్డ్ లేకపోయినా ఫ్లిప్‌కార్ట్ UPI ద్వారా గిఫ్ట్ కార్డ్ కొంటే 5% ఆఫర్ వస్తుంది, చెక్అవుట్ వద్ద క్యాష్‌లా వాడవచ్చు.
చివరి సలహా:
- చిన్న షాపింగ్: సింపుల్ బ్యాంక్ డైరెక్ట్ డిస్కౌంట్ వాడండి.
- పెద్ద షాపింగ్: వోచర్, ప్రీమియం కార్డ్ రివార్డ్స్ వాడితే మాక్స్ లాభం.
- EMI తీసుకుంటే, ముందే లెక్కలు వేసి చూసుకోండి.
పండుగల్లో షాపింగ్ అనేది ఉత్సాహమే కాదు, లెక్కల గేమ్. ఎవరు బాగా లెక్క కడతారో వాళ్లకే అసలు డిస్కౌంట్ దొరుకుతుంది.
Read also :