हिन्दी | Epaper
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

News Telugu: Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

Rajitha
News Telugu: Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం గూగుల్ క్రోమ్ (Google Chrome), మొజిల్లా ఫైర్‌ఫాక్స్ (Mozilla Firefox) బ్రౌజర్‌లను ఉపయోగించే యూజర్లకు భద్రతాపరమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ రెండు ప్రముఖ బ్రౌజర్‌లలో గుర్తించిన తీవ్రమైన సైబర్ లోపాలు (Security Vulnerabilities) కారణంగా, హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ప్రమాదం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT-In) వెల్లడించింది. CERT-In తాజా అడ్వైజరీ ప్రకారం, పాత వెర్షన్‌లను ఉపయోగిస్తున్న వారిలో డేటా హ్యాకింగ్, పాస్‌వర్డ్ లీక్, మాల్వేర్ ఇన్‌స్టాలేషన్ వంటి ప్రమాదాలు ఉన్నాయని పేర్కొంది. హ్యాకర్లు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ల ద్వారా యూజర్ల సిస్టమ్‌లోకి చొరబడి, హానికరమైన కోడ్‌ను నడిపే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా, ఈ భద్రతా లోపాలను వాడుకుని డినయల్ ఆఫ్ సర్వీస్ (DoS) దాడులు జరగవచ్చని తెలిపింది. ప్రధానంగా Windows, macOS, Linux వంటి డెస్క్‌టాప్ యూజర్లు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సూచించింది.

Read also: Chandrayaan-2: చంద్రయాన్-2 మరో చారిత్రాత్మక ఆవిష్కరణ

Chrome Update

Chrome Update: క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

సైబర్ ముప్పుల నుంచి రక్షణకు సూచనలు

యూజర్లు తమ బ్రౌజర్‌లను వెంటనే తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. గూగుల్, (google) మొజిల్లా సంస్థలు ఇప్పటికే భద్రతా ప్యాచ్‌లు విడుదల చేశాయి. అనుమానాస్పద లింకులు లేదా తెలియని వెబ్‌సైట్‌లను తప్పించుకోవాలి.

క్రోమ్ అప్‌డేట్ విధానం:

క్రోమ్ ఓపెన్ చేసి, పైభాగంలోని మూడు చుక్కల మెనూను క్లిక్ చేయండి. Help → About Google Chrome ఎంపిక చేయండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేస్తుంది. అప్‌డేట్అ యిన తర్వాత ‘Relaunch’ బటన్ నొక్కండి.

ఫైర్‌ఫాక్స్ అప్‌డేట్ విధానం:

ఫైర్‌ఫాక్స్ ఓపెన్ చేసి, మూడు అడ్డగీతల (Menu) గుర్తుపై క్లిక్ చేయండి. Help → About Firefox ఎంపిక చేయండి. బ్రౌజర్ ఆటోమేటిక్‌గా తాజా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

CERT-In సూచన:

సైబర్ దాడుల ప్రమాదాన్ని నివారించడానికి, యూజర్లు తక్షణమే బ్రౌజర్‌లను అప్‌డేట్ చేసి సురక్షిత బ్రౌజింగ్‌ను కొనసాగించాలని ప్రభుత్వ సంస్థ సూచించింది.

కేంద్ర ప్రభుత్వం ఏ హెచ్చరిక జారీ చేసింది?
క్రోమ్ మరియు ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో భద్రతా లోపాల కారణంగా అత్యవసర హెచ్చరిక.

ఈ భద్రతా సమస్యల వల్ల ఏమయ్యవచ్చు?
హ్యాకర్లు వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఆర్థిక వివరాలను దొంగిలించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870