దేశీయ టెలికాం రంగంలో మరోసారి పోటీని పెంచుతూ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ఆకర్షణీయమైన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా సంస్థ ఫైబర్ బేసిక్ ప్లాన్(Basic Plan) ను కేవలం ₹399 నెలసరి చార్జీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో యూజర్లు నెలకు 3300 GB హై-స్పీడ్ డేటాను 60 Mbps వేగంతో పొందగలరు. ఆ లిమిట్ పూర్తయిన తర్వాత కూడా కనెక్షన్ పూర్తిగా నిలిచిపోకుండా 4 Mbps స్పీడ్‌తో కొనసాగుతుంది, ఇది వినియోగదారుల కోసం పెద్ద ప్లస్ పాయింట్.
Read Also: Google: అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం

బీఎస్‌ఎన్‌ఎల్(BSNL) తెలిపిన వివరాల ప్రకారం —
- ఈ ప్లాన్‌లో మొదటి నెల ఉచితం, అంటే కొత్త యూజర్లకు అదనపు ఖర్చు ఉండదు.
- అంతేకాక, మొదటి మూడు నెలలపాటు ప్రతి నెల ₹100 తగ్గింపు కూడా అందిస్తుంది.
- ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఎక్కువశాతం పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది.
డేటా వినియోగం ఎక్కువగా ఉన్న విద్యార్థులు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు మరియు చిన్న వ్యాపారాల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: