iPhone 17 Pro Max : iPhone 17 సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న అధికారికంగా విడుదల కానుంది. ఈ సారి Apple తన అతిపెద్ద హార్డ్‌వేర్ లాంచ్ ఈవెంట్‌ను “Awe Dropping” అనే పేరుతో కుపర్టినో, కాలిఫోర్నియాలో జరపనుంది. ఈ ఈవెంట్‌లో iPhone 17, iPhone 17 Air, iPhone 17 Pro, మరియు (iPhone 17 Pro Max) మోడళ్లు ఆవిష్కరించబడతాయి. అయితే అందరిలో ఆసక్తిని రేపుతున్నది iPhone 17 Pro సిరీస్.
ధర (Price):
iPhone 17 Pro మరియు iPhone 17 Pro Max ధరల్లో ఈసారి $50 పెరుగుదల ఉండనుంది. దాంతో, Pro మోడల్ ధర $1,049 నుండి, Pro Max మోడల్ ధర $1,249 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
డిజైన్ (Design):
ఈసారి డిజైన్‌లో పెద్ద మార్పులు చేయనుంది. ముఖ్యంగా కెమెరా ఐలాండ్ స్థానంలో పూర్తి వెనుక భాగాన్ని కవర్ చేసే కొత్త హారిజాంటల్ కెమెరా సెటప్ తీసుకురానున్నారు. టైటానియం ఫినిష్ బదులుగా హాఫ్-గ్లాస్, హాఫ్-అల్యూమినియం ఫినిష్ ఉండనుంది. కొత్త ఆరెంజ్ కలర్ వేరియంట్ తో పాటు బ్లాక్, వైట్, గ్రే, డార్క్ బ్లూ కలర్స్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి.
డిస్‌ప్లే (Display):
iPhone 17 Pro 6.3 అంగుళాలు, Pro Max 6.8 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నాయి. ఈసారి యాంటీ-రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండనుంది, ఇది స్క్రీన్ గ్లేర్ తగ్గించడంలో సహాయపడుతుంది. డైనమిక్ ఐలాండ్ సైజ్ కొంచెం చిన్నదిగా మార్చే అవకాశం ఉంది.
కెమెరా (Camera):
iPhone 17 సిరీస్‌లో 24MP సెల్ఫీ కెమెరా ఉండనుంది, ఇది గత 12MP కంటే మెరుగైన ఫోటో క్వాలిటీ ఇస్తుంది. Pro మోడల్స్‌లో 48MP టెలిఫోటో లెన్స్ కూడా రానుంది, దాంతో మూడు 48MP కెమెరాలు ఉండే మొదటి iPhones అవుతాయి.
బ్యాటరీ (Battery):
iPhone 17 Pro Max లో 5,000mAh బ్యాటరీ ఉండనుంది (గతంలో 4,676mAh తో పోల్చితే పెద్ద అప్గ్రేడ్). రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ (7.5W), 45W ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా రానుంది.
ప్రాసెసర్ (Processor):
iPhone 17 Pro మోడల్స్ Apple A19 Pro చిప్‌సెట్‌పై నడుస్తాయి, ఇది 3nm టెక్నాలజీతో తయారు చేయబడింది. RAM 12GB కి పెరుగుతుంది, దీని వల్ల iOS 26 లోని Apple Intelligence ఫీచర్లు మరింత స్మూత్‌గా రన్ అవుతాయి.
Read also :