ఓపెన్‌ఏఐ సంస్థ చాట్(AI) జీపీటీ వినియోగదారుల కోసం సరికొత్త ‘హెల్త్ అసిస్టెంట్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త సౌకర్యం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై స్పష్టమైన, సులభమైన సమాచారం పొందవచ్చు. సాధారణ లక్షణాలపై సందేహాల నుంచి చికిత్సపై అవగాహన వరకు ఈ హెల్త్ అసిస్టెంట్ సహాయం అందిస్తుంది.
Read Also: Swadeshi Tech: జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ప్రత్యేకంగా ల్యాబ్ టెస్టుల రిపోర్టులను అర్థం చేసుకోవడంలో చాలా మందికి ఉండే సందేహాలను ఈ ఫీచర్ తొలగిస్తుంది. రిపోర్టుల్లో కనిపించే విలువలు ఏం సూచిస్తున్నాయి, ఏ అంశాలపై జాగ్రత్త అవసరం అనే విషయాలను సులభమైన భాషలో వివరిస్తుంది. అలాగే డాక్టర్‌ను కలిసే సమయంలో తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్నలను ముందుగానే సూచించడం ద్వారా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంతేకాదు, ఆరోగ్య బీమా పాలసీల్లో అందుబాటులో ఉన్న ప్రయోజనాలు, క్లెయిమ్ విధానం, కవరేజ్ వివరాలపై కూడా అవసరమైన సమాచారాన్ని ఈ హెల్త్ అసిస్టెంట్(AI) అందించగలదు. దీంతో యూజర్లు వైద్య ఖర్చులపై స్పష్టత పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికాలో ప్రారంభించిన ఓపెన్‌ఏఐ, త్వరలోనే యూరోపియన్ దేశాలకు విస్తరించనుందని వెల్లడించింది. అదేవిధంగా వెబ్‌తో పాటు ఐఒఎస్ యూజర్లకు కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. డిజిటల్ హెల్త్ రంగంలో ఇది ఒక కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: