Teacher mlc nominations from today

నేటి నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు..

హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలోని అభ్యర్థులు నల్లగొండలోనే నామినేషన్లు వేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. ఈ నెల 11న స్క్రూట్నీ, 13న ఉపసంహరణ అనంతరం 27న పోలింగ్‌ నిర్వహించి మార్చి 3న ఫలితాలను లెక్కించనున్నారు. దీనికి సంబంధించి ఎన్నికల యంత్రాంగం జిల్లాలో 200 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయగా, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో 24,905 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

image

వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న షెడ్యూల్‌ విడుదల చేయగా నేడు నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. నల్లగొండ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తూ ఈ నెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

మరోవైపు.. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నరేందర్‌రెడ్డిని, అంజిరెడ్డిని బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ బీసీ కార్డుతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి, భంగపడ్డ ప్రసన్న హరికృష్ణను తమ అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైంది. బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు ఈ మేరకు పార్టీ చీఫ్‌ కేసీఆర్‌కు ప్రతిపాదించారని, ఆయన సోమవారం అధికారికంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. అయితే.. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన కరీంనగర్‌ మాజీ మేయర్‌ సర్దార్‌ రవీందర్‌సింగ్‌ రెబల్‌గా పోటీలో దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related Posts
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు KCRను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్
ponnam fire

తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదమైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు Read more

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు
Appointment of YCP Regional

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి Read more

సీఎం యోగి నివాసం కింద శివలింగం – అఖిలేశ్
సీఎం యోగి నివాసం కింద శివలింగం - అఖిలేశ్

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం కింద శివలింగం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఈ విషయంపై Read more

ఈనోకు ఫ్రీ పబ్లిసిటీ – హైదరాబాద్ అంతా హోర్డింగులు
ktr digest the growth posters hyderabad

సినిమా హాళ్లలోనో లేకపోతే టీవీల్లోనే ఈనో ప్రకటన వస్తుంది. భోజనం చేసిన తర్వాత వచ్చే కడుపులో మంటని ఈనో తగ్గిస్తుందని ఆ ప్రకటనల సారాంశం. ఆ ప్రకటలను Read more