ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత, పులివెందులలో తొలిసారి తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితం టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలను రేపగా, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసింది.లతా రెడ్డి, పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి సతీమణి. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే హోరాహోరీగా జరిగాయి. పోలింగ్ రోజు నుంచి ఫలితాల వరకు రెండు పార్టీల శ్రేణులు కూడా గట్టి ఆసక్తితో కౌంటింగ్‌ను గమనించాయి. కడప శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్‌లో ఉదయం నుంచే ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
పులివెందులతో పాటుగా ఒంటిమిట్టకు కూడా కౌౌంటింగ్
పులివెందుల జెడ్పీటీసీ స్థానం గతంలో ఎక్కువసార్లు ఏకగ్రీవంగా ఎంపిక అయ్యేది. 2016 మినహా, ఇతర ఎన్నికల్లో పోటీ తక్కువగా ఉండేది. కానీ ఈసారి మాత్రం 11 మంది అభ్యర్థులు బరిలోకి దిగి పోటీని కఠినతరం చేశారు. అధికార వైఎస్సార్‌సీపీ (YSRCP) ఈ స్థానం మీద పూర్తి నమ్మకంతో బరిలోకి దిగింది. అయితే, స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలు, రాజకీయ వ్యూహాలు కలిసి ఈ ఎన్నికల్లో ఫలితాన్ని ప్రభావితం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పులివెందులతో పాటుగా ఒంటిమిట్టకు కూడా కౌౌంటింగ్ జరుగుతోంది.. అక్కడా టీడీపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండులో పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించి మూడు రౌండ్లు, పది టేబుళ్లు ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ ఒంటిమిట్ట ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించింది.

దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది
ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్‌కు హాజరుకావడం లేదన్నారు. పులివెందులలో 11మంది అభ్యర్థులు పోటీచేసినా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిల మధ్య పోటీ జరిగింది. ఒంటిమిట్టలో కూడా 11మంది బరిలో ఉన్నా టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది.పోలింగ్ రోజు టెన్షన్ వాతావరణం కనిపించింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ (TDP) నేతల మధ్య వార్ నడిచింది. టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని, దొంగ ఓట్లు వేయిస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఏపీ ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్య పద్ధతిలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ జరగలేదన్నారు. పోలీసుల్ని అడ్డంగా పెట్టుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్టలో కేంద్ర బలగాల మోహరించి.
జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
ఆ తర్వాత రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ హైకోర్టును కూడా ఆశ్రయించారు.పులివెందుల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్‌రెడ్డి మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆక్ష్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ, కడప జిల్లా జెడ్పీ ఛైర్మన్ పదవులకు గతేడాది జూన్ 7న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
టీడీపీ పూర్తి పేరు ఏమిటి?
టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ.
టీడీపీని ఎవరు స్థాపించారు?
1982లో నందమూరి తారక రామారావు (ఎన్‌టిఆర్) స్థాపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: