TDP : రేపు లోక్ సభ ముందుకు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు టీడీపీ మద్ధతు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) స్పష్టమైన వైఖరి ప్రకటించింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ, ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతును ప్రకటించింది. దీంతో పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చ రసవత్తరంగా సాగనుంది.వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రేపు (మంగళవారం) లోక్‌సభలో ఓటింగ్ జరగనుండడంతో టీడీపీ తమ ఎంపీలందరికీ హాజరు కావాలని విప్ జారీ చేసింది. టీడీపీ చీఫ్ విప్ హరీశ్ బాలయోగి, మూడు లైన్ల విప్‌ను విడుదల చేశారు.

ఇది ప్రాముఖ్యత దృష్ట్యా టీడీపీ సభలో హాజరై, తమ మద్దతును తెలియజేయాలని స్పష్టమైన సందేశం ఇచ్చింది.మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.అనంతరం ఎల్లుండి (బుధవారం) రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ చర్చలకు సమగ్రంగా 8 గంటల సమయం కేటాయించామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ప్రకటించింది.ఈ ముఖ్యమైన చట్ట సవరణ బిల్లుపై కేంద్రంలో ప్రధాన పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ కూడా తమ ఎంపీలందరికీ పార్లమెంటుకు హాజరై ఉండాలని విప్ జారీ చేశాయి. ఈ నిర్ణయంతో బిల్లుపై చర్చ ఉత్కంఠభరితంగా సాగనుంది.వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సభలో ఆసక్తికర చర్చ జరగనుంది. టీడీపీ మద్దతు ప్రకటించడంతో ఎన్డీయేకు మరింత బలమైన మద్దతు లభించనుంది. మరోవైపు, పక్ష, విపక్షాలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ చట్ట సవరణ రాజ్యాంగపరంగా ఎంతవరకు ప్రభావం చూపనుందో వేచి చూడాలి!