ycp kamalapuram

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్

వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు జాయిన్ కాగా…ఇప్పుడు కిందిస్థాయి నేతలు చేరుతున్నారు. తాజాగా కమలాపురం పురపాలక సంఘంలోని వైసీపీ నేతలు…టీడీపీ లో చేరారు.పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు.

ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.

Related Posts
స‌హానా కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన వైఎస్‌ జ‌గ‌న్
YS Jagan counseled Sahana family

అమరావతి: గుంటూరు జిల్లా తెనాలిలోని యువతి సహానా రౌడీషీటర్ నవీన్ చేత దాడి అయ్యి తీవ్రంగా గాయపడిన తర్వాత మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని గుంటూరు Read more

ఏపీ సీఎంతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ భేటీ
NITI Aayog Vice Chairman meets AP CM

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ భేరీ నేతృత్వంలోని బృందం ఈరోజు సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర Read more

పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా?
పవన్ కళ్యాణ్ ను, తెలుగు దేశం ఇబ్బంది పెడుతోందా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉపముఖమంత్రి పదవి చుట్టూ తిరుగుతున్నాయి . ఇన్నాళ్లు పవన్ చేసిన త్యాగాలు , సహాయాలు గుర్తింపు గా పవన్ కు ఉపముఖమంత్రి పదవి ఇచ్చినట్టు Read more

తిరుపతిలో 144 సెక్షన్‌ అమలు..!
Implementation of Section 144 in Tirupati.

తిరుమల : తిరుపతిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఎస్వీ యూనివర్సిటీ Read more