ycp kamalapuram

కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ షాక్

వైసీపీ అధినేత జగన్ కు వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నేతలంతా రాజీనామా చేస్తూ టీడీపీ , జనసేన లలో చేరుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు జాయిన్ కాగా…ఇప్పుడు కిందిస్థాయి నేతలు చేరుతున్నారు. తాజాగా కమలాపురం పురపాలక సంఘంలోని వైసీపీ నేతలు…టీడీపీ లో చేరారు.పురపాలక ఛైర్మన్‌ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్‌నూరి, రాజేశ్వరి, సలీల, నాగమణి సోమవారం టీడీపీలో చేరారు.

Advertisements

ఇదివరకే కొందరు కౌన్సిలర్లు చేరగా తాజాగా చేరిన వారితో కలుపుకొని టీడీపీ సంఖ్యా బలం 10కి పెరిగింది. ఫలితంగా వైసీపీ సంఖ్యా బలం 8కి తగ్గింది. దీంతో కమలాపురం పురపాలక పీఠం దాదాపు అధికార పార్టీ వశమైనట్టే. త్వరలో జరిగే పురపాలక సర్వసభ్య సమావేశంలో ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో కమలాపురం వైసీపీ శాసనసభ్యుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డికి భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.

Related Posts
పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కార్పొరేటర్లు
YSRCP corporators join Jana

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు భారీగా జనసేనలో చేరారు. ఒంగోలు నగరానికి చెందిన Read more

క్లీన్ ఈక్వల్ మిషన్‌ను పరిచయం చేసిన ఐటీసీ నిమైల్
ITC Nimile introduced Clean Equal Mission

సమానత్వంతో కూడిన భవిష్యత్తు కోసం క్లీన్ ఈక్వల్ టుడేని సమిష్టిగా నిర్మించే ఆలోచన రేకెత్తించే, కార్యాచరణ ఆధారిత ప్రయత్నం.. హైదరాబాద్: భారతదేశంలో విశ్వసనీయ గృహ పరిశుభ్రత బ్రాండ్, Read more

బోరుగడ్డ అనిల్‌పై మరో కేసు
borugadda anil kumar

రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్‌పై పోలీసులకు మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు సంబంధించి మే Read more

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌
Modi government has brought a new scheme for women named Swarnima

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా Read more