pavan and lokesh

నారాలోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తిక వ్యాఖ్యలు

చలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడికి పుట్టిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో రాజకీయం వేడెక్కింది. అయితే రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాదు ముఖ్యమంత్రి కూడా కావాలి అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వాగతిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కూటమిలో పెద్దలు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో నిర్ణయిస్తారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. పార్టీ నేతలు ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనని.. అలాగే లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని.. సీఎం చంద్రబాబు చెబితేనే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

అయితే డిప్యూటీ సీఎం, సీఎం పదవులు అంటూ టార్గెట్‌గా చేసుకుని వైఎస్సార్‌సీపీ సైకోలు కూటమిలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదిరెడ్డి శ్రీనివాస్.
మంత్రి నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ ఆసక్తికరంగా స్పందించారు. జనసేన పార్టీ నేతల దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని.. సీఎం చంద్రబాబుతో కలిపి నలుగురని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకోవడంలో తప్పు లేదని.. తాము కూడా పవన్ కళ్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Related Posts
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు

నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్) మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ యొక్క 29వ వర్ధంతి Read more

ఎంపీడీవోను పరామర్శించిన పవన్‌ కల్యాణ్‌
kalyan

వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ శనివారం పరామర్శించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగిన Read more

ఏపీ వార్షిక బడ్జెట్‌కు క్యాబినెట్‌ ఆమోదం
Cabinet approves AP Annual Budget

మొత్తం రూ.3.20 లక్షల కోట్లతో వార్షి బడ్జెట్‌‌ అమరావతి: 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం Read more

‘తల్లికి వందనం’ పథకం అమలు ఎప్పుడంటే
'తల్లికి వందనం' పథకం అమలు ఎప్పుడంటే

ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రవేశ పెట్టేందుకు సమాయత్తం అయింది. 2025-26 వార్షిక బడ్జెట్ రేపు (శుక్ర వారం) అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. Read more