100 కోట్ల మార్క్‌ వైపు తండేల్ ప‌రుగు

100 కోట్ల మార్క్‌ వైపు తండేల్ ప‌రుగు

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా విడుదలైన తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఫిబ్రవరి 7న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విభిన్నమైన కథతో ప్రేక్షకుల మనసును దోచుకుంది.

newproject 2025 02 08t210539 379 1739028985

రెండు రోజుల్లోనే 41 కోట్ల వసూళ్లు:
సినిమా విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ. 41 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు నమోదు చేసింది. స్టోరీ, విజువల్స్, నటన అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు :
తాజా అప్‌డేట్ ప్రకారం, సినిమా విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్ల వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ వీకెండ్‌లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరనుంది.

గీతా ఆర్ట్స్:
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన సంగీతం, సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. చైతన్య, సాయి పల్లవి డీ-గ్లామర్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. నటీనటుల శ్రమ స్పష్టంగా కనిపించేలా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ 30 రోజులపాటు ఎండలో, వానలో, సముద్రంలో నిరంతరం కష్టపడి చేయాల్సి వచ్చింది. సముద్ర సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ సినిమా రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని సమాచారం. నాగచైతన్య కెరీర్‌లో ఇదే అత్యంత ఖరీదైన సినిమా.

100 కోట్ల క్లబ్‌లోకి తండేల్:
సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఈ వారాంతానికి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బుజ్జితల్లి, రాజుగా సాయి పల్లవి, చైతూ త‌మ‌ పాత్ర‌ల్లో జీవించారు. దాంతో ఈ పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక పాకిస్థాన్ ఎపిసోడ్ సినిమాలో చాలా కీలకం. అయినా ఎమోషన్ అంతా రాజు, బుజ్జితల్లిల మధ్యే నడుస్తుంది. మూవీ ప్రారంభం నుంచి ఎండ్‌ కార్డ్ పడేవరకూ త‌మ‌ ప్రేమతో నింపేశారు. ఈ వారం వీకెంట్ పూర్తయ్యేనాటికి తండేల్ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని సమాచారం.

Related Posts
జాన్వి లో ఇంత టాలెంట్ ఉందా?
janhvi kapoor 6

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎంతో తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఆమె తెరంగేట్రం ధడక్ చిత్రంతో జరిగింది, మరియు ఆ చిత్రంతోనే సూపర్ హిట్ Read more

Betting Apps Case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !
Vishnu Priya approaches the High Court!

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో Read more

Mahesh Babu: యంగ్ హీరో సినిమాలో కృష్ణుడిగా మహేష్ బాబు.. క్లారిటీ ఇదిగో;
mahesh babu 1

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ కోసం రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు ఇటీవలే మహేష్ బాబు "గుంటూరు కారం" చిత్రంతో ప్రేక్షకుల Read more

చిరంజీవి సినిమా సెట్స్ పై ఇద్దరు భామలతో వెంకీ మామ సందడి
20241011fr67094647e41f3 scaled

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు, సెట్స్ మీద నుంచి మరింత ఉత్సాహం పంచుతున్నారు. తాజాగా, చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా సెట్స్ పై, Read more