నవదంపతులు అర్జెంటు గా పిల్లల్ని కనండి : స్టాలిన్

నవదంపతులు అర్జెంటు గా పిల్లల్ని కనండి : స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకె కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన ఆయన ఇప్పుడు జనాభా పెంపుపై ఆసక్తి చూపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఇటీవల నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర జనాభా పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, కొత్తగా పెళ్లైన జంటలు పిల్లలను త్వరగా కనాలని సూచించారు. అంతేకాకుండా, తమ పిల్లలకు మంచి తమిళ పేర్లు పెట్టాలని కూడా సూచించారు.

నియోజకవర్గాల పునర్విభజన

జనాభా ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను నిర్ధారించే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణను ప్రోత్సహిస్తూ జనాభా వృద్ధికి అడ్డుకట్ట వేసింది. కానీ ఇప్పుడు అదే విధానం రాష్ట్రానికి లోక్‌సభ స్థానాల పరంగా నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని స్టాలిన్ అభిప్రాయపడ్డారు.

జనాభా ప్రతిపాదికన

గతంలో కొత్తగా పెళ్లైన జంటలకు పిల్లల్ని కనడాన్ని కొంతకాలం ఆలస్యం చేయాలని సూచించిన తానే, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, తమిళ జనాభా పెరగాలని కోరుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని సీఎం అన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ వివాహ వేడుకలో కూడా ప్రస్తావించారు. ఇప్పుడు మరింత స్పష్టంగా మాట్లాడుతూ, లోక్‌సభ స్థానాల పరంగా నష్టం జరగకుండా ఉండాలంటే తమిళ జనాభా పెరగడం తప్పనిసరిగా మారిందని వివరించారు.

మిశ్రమ స్పందన

రాష్ట్ర జనాభా పెరిగేందుకు కృషి చేస్తున్నానని కొత్తగా పెళ్లైన జంటలు అన్నీ వెంటనే పిల్లల్ని కనాలని సూచించారు. వారికి మంచి తమిళ్ పేర్లు కూడా పెట్టాలని చెప్పుకొచ్చారు. నేరుగా ముఖ్యమంత్రియే ఈ కామెంట్లు చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. కొందరేమో లోక్‌సభ స్థానాల కోసం తాము వెంటనే పిల్లల్ని కంటామని చెబుతుండగా మరికొందరు కష్టం సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

750x450 788711 untitleddesign67

అఖిలపక్ష సమావేశం

ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్లు చేయడం ఇదే తొలి సారి కాదు. ఇటీవలే ఓ పెళ్లికి వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. పరిమితంగా పిల్లల్ని కని సందపతో జీవించాలనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రమ ప్రచారాన్ని చేపట్టామని,కానీ దీని వల్ల నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఏర్పడిందన్నారు. ఈనెల 5వ తేదీన ఈ అంశంపై చర్చించేందుకు సీఎం అఖిలపక్ష సమావేశానికి కూడా పిలుపునిచ్చారు.

కొందరు దీనికి మద్దతు ఇస్తూ, లోక్‌సభ స్థానాల పరంగా తమిళనాడు వెనకబడి పోకుండా ఉండాలని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఒక్కో కుటుంబం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల సంఖ్యను నియంత్రించుకోవడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసిన తరువాత సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.

Related Posts
యమునా నది నీటిని తాగిన హర్యానా సీఎం
Haryana CM Naib Singh Saini drank water from Yamuna river

చండీగఢ్‌: దేశ రాజధాని ఢిల్లీలోని యమునా నది కాలుష్యంపై వివాదం కొనసాగుతున్నది. ఈ జలాల్లో అమోనియా ఎక్కువగా ఉందని, నీరు విషపూరితం కావడానికి హర్యానా కారణమని ఆప్‌ Read more

ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం
ఆల్ టెర్రయిన్ వెహికిల్స్ తో భద్రత మరింత కట్టుదిట్టం

సరిహద్దుల్లో పహారా కాచే సైన్యం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే కాలి నడకను ఎక్కువగా ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రతికూల వాతావరణంలో భద్రతా సిబ్బంది కళ్లుగప్పి Read more

ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ!
ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ కీలక భేటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలన్నీ కసరత్తు మొదలు పెట్టారు. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా తమిళగ Read more

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: డీకే శివకుమార్
నాపై తప్పుడు ప్రచారం చేసిన డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారంపై స్పందించారు. మహా శివరాత్రి సందర్భంగా కోయంబత్తూరులో ఇషా Read more