ప్రభుత్వానికి ఆలోచనపరుల వేదిక తరపున టి.లక్ష్మీనారాయణ విజ్ఞప్తి
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్న పోలవరం బనకచర్ల పథకం విషయంలో నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరించకుండా విజ్ఞతతో పునరాలోచించి నీటిపారుదల రంగానికి చెందిన నిపుణులు, జలవనరుల అధ్యయనకారులతో, లోతుగా చర్చించి తగు, నిర్ణయం తీసుకోవాలని ఆలోచన పరుల వేదిక తరపున నీటిపారుదల నిపుణులు టి. లక్ష్మినారాయణ (T. Lakshminarayana) ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజప్తి చేశారు. పోలవరం బనకచర్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రీ ఫిజిబులిటీ రిపోర్ట్ను కేంద్ర పర్యావరణ అధ్యయన కమిటీ తిరుగుతపాలలో వెనక్కు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి పంపడం ద్వారా మాకు ఆశ్చర్యం కలిగించలేదని, అది అత్యంత లోపాఇష్టంగా ఉండడమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
పర్యావరణ అనుమతులు మంజూరు చేశామని
కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే, గోదావరిలో వరద నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం అభిప్రాయాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి, పోలవరం ప్రాజెక్టుకు 2005లో పర్యావరణ అనుమతులు మంజూరు చేశామని, ఒడిస్సా, చత్తీష్ ఘడ్ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యాలు న్యాస్థానంలో విచారణలో ఉన్నాయన్నారు. అంతరాష్ట్ర అంశాలు, గోదావరి ట్రిబ్యూనల్ (Godavari Tribunal) తీర్పుతో కూడా ముడిపడి ఉన్నందున, పెద్ద ఎత్తున అటవీ భూముల సేకరణ, టైగర్ పారెస్ట్ అయిన నల్లమల అడవుల గుండా నిర్మించబడే పథకంగా రూపొందించబడిందన్నారు.వాస్తవిక దృష్టితో పరిశీలిస్తే ఇవన్నీ సంక్లిష్టమైన సమస్యలే అని పేర్కొన్నారు. ఈ అంశాలను మేము గత మీడియా సమావేశంలోనే స్థూలంగా ప్రస్థావించినట్లు గుర్తు చేశారు. ఒడిస్సా, రాష్ట్రాల్లో బిజెపి, ఆంధ్రప్రదేశ్లో కూటమి, కేంద్రంలో మోడీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి.

నేడు మళ్లీ ఇంకోసారి విజప్తి చేస్తున్నామన్నారు
కావున పోలవరంపైన, వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపైన సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న వ్యాజ్యాలపై చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవ తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. నేడు మళ్లీ ఇంకోసారి విజప్తి చేస్తున్నామన్నారు. నదీ జలాల హక్కులపై మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టులను నేనెప్పుడూ వ్యతిరేకించలేదని, గోదావరి (Godavari) లో 3వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయని, మేము ప్రాజెక్టును నిర్మించుకుంటాం, మీరు కూడా ప్రాజెక్టులు నిర్మించుకోండి అటూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే స్పందించి, సద్విమర్శ చేశామన్నారు. 1980లో గోదావరి ట్రిబ్యూనల్ ఇచ్చిన తీర్పుకు, ఆంధ్రప్రదేశ్ పునర్వవస్తీకరణ చట్టం-2014కు లోబడి మాత్రమే ప్రాజెక్టులను రెండు రాష్ట్రాలు నిర్మించుకోవాలని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించాలన్న అభిప్రాయాన్ని నాడు చెప్పామని నేడు పునరుద్ఘాటిస్తున్నామన్నారు.
రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు
రాష్ట్ర విజభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీకి సంబంధించి అస్పష్టత కొనసాగుతోందని, రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్లో కూడా రికార్డు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పూర్వరంగంలో తెలంగాణ వాటా 968 టీఎంసీలంటూ ఓ కాకిలెక్క చెబుతూ వెయ్యి టీఎంసీలు తమకు కేటాయిస్తూ రాత పూర్వకంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 485 టీఎంసీలకు మించి వాడుకునే హక్కు లేదని జులై 1న తెలంగాణ శాసనసభ్యుల సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సమక్షంలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేస్తూ వ్యాఖ్యానించడం అత్యంత గర్హనీయం అన్నారు. కృష్ణా నది జలాలపై మాట్లాడుతూ.. తెలంగాణాలో 68శాతం కృష్ణా బేసిన్ ఉన్నదని, 555 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Tirumala: తిరుపతి లో తొక్కిసలాట ఘటనపై నేడే నివేదిక