ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజలకు సహాయం చేయాలని ప్రజలను కోరాడు. మసీదుల్లో విరాళాలు తీసుకున్నాడు. కానీ ఆ డబ్బుతో గాజాకే కాదు, ఏ పేదవాడికీ చెల్లించలేదు. సిరియా నుంచి వచ్చిన అలీ మేఘత్ అల్-అజ్హర్ (Ali Meghat Al-Azhhar) అనే యువకుడు ఈ మోసం వెనుక ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.23 ఏళ్ల అలీ గుజరాత్‌లోని మసీదులు లక్ష్యంగా పెట్టుకున్నాడు. గాజాలో తిండిలేని ప్రజల వీడియోలు చూపిస్తూ, సహాయం చేయండి అన్నాడు. నమ్మిన ప్రజలు విరాళాలు ఇచ్చారు. కానీ ఆ డబ్బుతో ఖరీదైన హోటళ్లలో బస చేశాడు. జల్సాలు చేశాడు. అంతా తేలికగా దొరికిపోయింది.అహ్మదాబాద్ (Ahmedabad) ఎల్లిస్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో అలీని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు ఉన్న ముగ్గురు సిరియా యువకులు పరారీలో ఉన్నారు. పోలీసులు వారిని వెతుకుతున్నారు.

నకిలీ మానవతా వేషం – లక్షల్లో దోపిడి
వీడియోలు చూపిస్తూ గాజా కోసం విరాళాలు కావాలని కోరారు. “మీ సాయం వాళ్లకు ప్రాణదాతగా మారుతుంది” అని చెప్పారు. కానీ అసలైన బాధితుల దగ్గరకు ఒక్క రూపాయి కూడా వెళ్లలేదు. ఈ ముఠా లక్షల్లో డబ్బు సేకరించింది.అలీ జూలై 22న టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కోల్‌కతా మీదుగా దేశంలోకి ప్రవేశించి, పలు ప్రాంతాలు తిరిగాడు. ఆగస్టు 2న అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. అతడి దుశ్చర్యలు అప్పటినుంచే మొదలయ్యాయి.పోలీసులకు సమాచారం అందడంతో హోటల్‌పై దాడి చేశారు. అలీ వద్ద 3,600 అమెరికన్ డాలర్లు, రూ.25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడి ముగ్గురు సహచరులు – జకరియా, అహ్మద్, యూసఫ్ – పరారీలో ఉన్నారు. వారిపై లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు.
దేశ భద్రతకూ ఇది బెదిరింపు?
ఈ కేసు కేవలం మోసంతోనే కాదు, భద్రతా పరంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్ ఎటిఎస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కలిసి దీని వెనక అంతరంగాలను వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు.నిందితుల పాస్‌పోర్ట్ వివరాలనూ అధికారులు విశ్లేషిస్తున్నారు. టూరిస్ట్ వీసాతో దేశంలోకి వచ్చి విరాళాలు సేకరించడం నిబంధనల ఉల్లంఘన. అలీపై దేశ బహిష్కరణ ప్రక్రియ మొదలుపెట్టారు.పేదల పేరు చెప్పి డబ్బు సంపాదించడంలో మానవత్వం ఎక్కడుందో ప్రశ్నించాల్సిన పరిస్థితి. అలాంటి మోసగాళ్లు జాతి పరంగా, మతపరంగా కాకుండా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Read Also :