భారతదేశం యొక్క అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు పునాది వేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసాయి. ఇది 12,000 మంది ట్రైనీలకు సాధికారత కల్పించడం మరియు పునరుత్పాదక ఇంధన రంగంలో విద్య మరియు నైపుణ్య-నిర్మాణాన్ని పునర్నిర్మించడం చేయనుంది.
ముఖ్యాంశాలు:
· భారతదేశపు అతిపెద్ద గ్రీన్ స్కిల్ అభివృద్ధి కార్యక్రమం
· 12 వేల మంది యువతకు శిక్షణ అందించటం ద్వారా ఉద్యోగ అంతరాలను పూరించటం లక్ష్యంగా చేసుకుంది
· వైవిధ్యాన్ని పెంపొందించేందుకు 3,000 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టింది
· ప్రాధమిక స్థాయి విద్యా సంస్థల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలు (ఐటిఐ /పాలిటెక్నిక్)
ఆంధ్ర ప్రదేశ్ : దివంగత శ్రీ తులసి తంతి మరియు ఆంధ్రప్రదేశ్ పట్ల ఆయనకున్న దృఢ నిబద్ధతకు నివాళిగా, హరిత ఉద్యోగాలను పెంపొందించడానికి మరియు భారతదేశంలోని పునరుత్పాదక రంగంలో ఉపాధి అంతరాన్ని తగ్గించడానికి భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు సుజ్లాన్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మార్గదర్శక కార్యక్రమం గ్రీన్ ఉద్యోగ అవకాశాలను పెంచడం ద్వారా మరియు పునరుత్పాదక శక్తిలో నైపుణ్య అంతరాన్ని పూరించడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో, ఈ కార్యక్రమం కనీసం 3,000 మంది మహిళలతో సహా 12,000 మంది యువతకు ఎలక్ట్రికల్, మెకానికల్, బ్లేడ్ టెక్నాలజీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ మరియు ల్యాండ్ & లియాజనింగ్ వంటి పవన విద్యుత్ తయారీకి సంబంధించిన ప్రత్యేక రంగాలలో శిక్షణను అందిస్తుంది. అంతేకాకుండా , ఐటిఐ , డిప్లొమా మరియు డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలల కోసం నిర్మాణాత్మక పాఠ్యాంశాలను సుజ్లాన్ రూపొందిస్తుంది మరియు పవన శక్తి పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంటెంట్ మరియు అధునాతన పరిశోధనలను ఏకీకృతం చేయడానికి విశ్వవిద్యాలయ భాగస్వామ్యాలను రూపొందిస్తుంది.

ఐటీ & మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మాట్లాడుతూ, “వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల స్థానిక ఉద్యోగాలను సృష్టించడం, ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్, స్వయం ఉపాధి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆదాయాన్ని పెంచడం మా లక్ష్యం. ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ కార్యక్రమం అల్పాదాయ కుటుంబాలకు సహాయం చేయడంతో పాటుగా పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం యొక్క ప్రతిభను పోత్సహించటానికి దోహదపడుతుంది” అని అన్నారు.
సుజ్లాన్ గ్రూప్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెపి చలసాని మాట్లాడుతూ, “దివంగత శ్రీ తులసి తంతి తరచుగా పునరుత్పాదక శక్తికి అంకితమైన విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని తపించేవారు, భారతదేశం తన ఇంజనీరింగ్ శ్రేష్ఠతకు ఆస్వాదిస్తున్న అదే ప్రపంచ గుర్తింపుతో ఈ రంగంలో ప్రతిభను పెంపొందించగల ప్రదేశంగా నిలవాలన్నది ఆయన భావన. ఈ వ్యూహాత్మక కార్యక్రమంతో, పర్యావరణ అనుకూల భవిష్యత్తును రూపొందించడంలో నాయకత్వం వహించేలా రాష్ట్రం నిలవడానికి, పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రతిభను ఎగుమతి చేసే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ” అని అన్నారు.
సుజ్లాన్ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ రాజేంద్ర మెహతా మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్య ప్రయత్నం ద్వారా, సుజ్లాన్ ఆంధ్రప్రదేశ్‌లోని 5 వ్యూహాత్మక ప్రదేశాలలో ‘లెర్నింగ్ ల్యాబ్స్’ స్థాపనకు నాయకత్వం వహిస్తుందని, తరగతి గది మరియు అనుభవ పూర్వక శిక్షణ ను మిళితం చేసే 3 నుండి 12 నెలల కార్యక్రమాలను అందజేస్తుంది. ఈ కేంద్రాలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్కిల్ డెవలప్‌మెంట్, శిక్షణ మరియు ఉద్యోగ నియామకాలకు కేంద్రాలుగా పనిచేస్తాయి, ఈ పరివర్తన కార్యక్రమ ప్రభావాన్ని మరింత విస్తరింపజేస్తాయి. ఈ కార్యక్రమం 12,000 కెరీర్‌లను నిర్మించడం ద్వారా భవిష్యత్ కోసం భారతదేశం యొక్క స్థిరమైన శ్రామిక శక్తిని రూపొందించడంలో సుజ్లాన్ పాత్రను బలపరుస్తుంది..” అని అన్నారు.