మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో 55 ఏళ్ల మహిళా ప్రొఫెసర్ ప్రజ్ఞా అగర్వాల్ (Pragya Agarwal
) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. ఆమె నివాసంలో రక్తపు మచ్చలతో పాటు, మణికట్టు మరియు మెడపై లోతైన గాయాలు ఉండటంతో ఇది ఆత్మహత్య అని అనుమానిస్తున్నారు. అయితే ఘటనపై పూర్తి స్పష్టత రావాల్సిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును అసాధారణ మరణంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ
ప్రజ్ఞా అగర్వాల్ ఇంటికి రోజువారీ పనిమనిషి వచ్చేసరికి ఆమె విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరాన్ని పరిశీలించగా, పలు చోట్ల గాయాలు, ముఖ్యంగా మెడపై మరియు చేతిపై కోతలు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఇంట్లో రక్తపు మచ్చలు కూడా ఉండటంతో సంఘటనపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పోలీసుల ప్రకారం, గాయాలు ఆమె తానే చేసుకుందా లేదా ఎవరైనా దాడి చేశారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఆత్మహత్యా..? హత్యా..? – దర్యాప్తులో ముందుకు పోలీసు శాఖ
ప్రజ్ఞా అగర్వాల్ ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన సమస్యలు, మానసిక పరిస్థితులు వంటి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఆమె బంధువులు, స్నేహితులు, సహచర ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ఆమె మరణానికి అసలు కారణం ఏంటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ విడుదల