న్యూయార్క్: ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యూఎస్ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ భారత్‌పై కూడా పడింది. ఇండియా లో ట్రాన్స్‌జెండర్ల కోసం ఏర్పాటు చేసిన 3 క్లినిక్‌లు మూతబడినట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 5 వేల మందికి వీటి వైద్య సేవలు అందడం లేదని సమాచారం. దేశంలో మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ల కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్లినిక్, అలాగే మహారాష్ట్రలోని కల్యాణ్, పూణే ప్రాంతాల్లో ఉండే క్లినిక్‌లు కూడా మూతపడినట్లు తెలుస్తోంది.

ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షలు
2021లో హైదరాబాద్‌లో మొదటిసారిగా మిత్ర ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్లినిక్‌లో ట్రాన్స్‌జెండర్లకు హర్మోన్ థెరపీపై అవగాహవన కల్పించడం, మానసిక ఆరోగ్యంతో పాటు HIV, ఇతర లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కౌన్సెలింగ్ ఇవ్వడం సేవలు అందించినట్లు పలు నివేదికలు తెలిపాయి. అంతేకాదు సాధారణ వైద్య సంరక్షణ, న్యాయసహాయంతో పాటు పలు సేవలు అందించినట్లు పేర్కొన్నాయి. ఈ సేవలు అందించేందుకు ప్రతిఒక్కరికీ ఏడాదికి రూ.30 లక్షల వరకు అవుతాయని చెప్పాయి.
భారత్‌లో మూతపడ్డ ఆ క్లినిక్‌లు
భారత్ లో 3 ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌లు మూసేసారని వస్తున్న వార్తలపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, అలాగే రిపబ్లికన్ పార్టీ సెనెటర్ జాన కెన్నెడీ స్పందించారు. అమెరికా ప్రజలు చెల్లిస్తున్న పన్నుల వల్ల ఏ దేశాలు బాగుపడుతాన్నాయో, ఎక్కడికి నిధులు వెళ్తున్నాయో ఇప్పుడైనా అర్థం అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికన్లు చెల్లించిన పన్నులతో నిధులు సమకూర్చిన అన్ని ప్రాజెక్టులు నిలిపివేసేందుకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు విదేశీ సహాయాలను నిలిపివేయాలని ఇటీవల ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే.