న్యూఢిల్లీ: క్రీడా మంత్రిత్వశాఖ భారత రెజ్లింగ్ సమాఖ్య పై ఉన్న సస్పెన్షన్‌ను మంగళవారం ఎత్తివేసింది. దేశీయ టోర్నమెంట్ల నిర్వహణ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు జాతీయ జట్ల ఎంపిక నిమిత్తం ఈ నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలతో సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు పోరాటం చేసిన విషయం తెలిసిందే.

డబ్ల్యూఎఫ్‌ఐ నియమావళికి విరుద్ధంగా
దాంతో కొత్త అధ్యక్షుడి కోసం సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించారు. వాటిలో బ్రిజ్‌భూషణ్ నమ్మిన బంటు సంజయ్‌సింగ్ గెలిచాడు. అనంతరం కొత్త పాలకవర్గం అత్యుత్సాహం ప్రకటించింది. డబ్ల్యూఎఫ్‌ఐ నియమావళికి విరుద్ధంగా అండర్-15, 20 జాతీయ ఛాంపియన్‌షిప్స్ నిర్వహిస్తామని ప్రకటించడం, పాత కార్యవర్గం (పరోక్షంగా బ్రిజ్‌భూషణ్) నియంత్రణలోనే ఇంకా సమాఖ్య ఉండటం లాంటి కారణాలతో 2023 డిసెంబర్ 24న భారత రెజ్లింగ్ సమాఖ్యపై క్రీడాశాఖ సస్పెన్షన్ విధించింది.
గడువు లోపు ఎన్నికలు
ఇంతకాలం డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారీ కార్యకలాపాలను అడ్‌హక్ కమిటీ చూసుకుంది. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. గడువు లోపు ఎన్నికలు నిర్వహించనందుకు 2023 ఆగస్టు 23న డబ్ల్యూఎఫ్‌ఐపై యుడబ్ల్యూడబ్ల్యూ(యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆరు నెలల అనంతరం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.