ఐపీఎల్ అంటేనే చెన్నై సూపర్ కింగ్స్ గుర్తుకు రావాల్సిందే. కానీ ఈ సీజన్‌లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. తమకున్న చరిత్రకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. దీనిపై జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశాడు.రైనా తేల్చిచెప్పాడు – “ఇప్పుడు చెన్నైకు గెలవాలన్న తపన కనిపించడం లేదు.” హర్భజన్ సింగ్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన రైనా, జట్టులో గెలుపు పట్ల ఉన్న కసి ఇప్పుడు కనిపించడంలేదని వాపోయాడు. “ఇది చెన్నై గర్వించదగిన ఆటతీరు కాదు,” అని తేల్చాడు.ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 2 విజయాలు మాత్రమే చెన్నై సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంటూ ప్లే ఆఫ్స్ అవకాశాల్ని కాసేపట్లో కోల్పోవొచ్చన్నట్టే కనిపిస్తోంది. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో గెలిస్తే తప్ప ఆశలు సజీవంగా ఉండడం కష్టమే.

జట్టులో సమతుల్యత లేదు – యువతను నిర్లక్ష్యం
వేలంలో స్టార్లను తీసుకున్నా సరే, జట్టు యువ ప్రతిభను గుర్తించడంలో విఫలమైంది, అని రైనా కఠినంగా విమర్శించాడు. టీఎన్‌పీఎల్‌లో మెరిసిన ఆటగాళ్లను పూర్తిగా పక్కనపెట్టినందుకే జట్టు ఈ స్థితికి చేరిందని చెప్పాడు.రైనా వివరంగా గుర్తు చేశాడు – “సాయి సుదర్శన్, సాయి కిషోర్, షారుక్ ఖాన్ లాంటి వాళ్లు గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుతంగా రాణిస్తున్నారు. వీళ్లంతా తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచే వెలుగులోకి వచ్చారు.” చెన్నై జట్టు ఇలాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదని, ఇదే ఇప్పుడు వెనుకబడటానికి కారణమని అన్నాడు.
ఓపెనింగ్ ఓవర్లలో దూకుడూ లేదు, డాట్ బాల్స్ అధికం
“పవర్‌ప్లే ఓవర్లలో జట్టు దూకుడుగా ఆడటం లేదు. చాలా బాల్స్ వృథాగా పోతున్నాయి. గతం లో పవర్‌ప్లేలో సిఎస్‌కె దూకుడుగా ఆడి ఆధిపత్యం చూపించేది,” అని రైనా గుర్తు చేశాడు. “స్ట్రైక్ రొటేషన్ లేదు, ఆఖరి ఓవర్లలో ప్రెషర్ సతమత పెడుతోంది,” అన్నాడు.“మురళీ విజయ్, అశ్విన్, బాలాజీ, బద్రీనాథ్ లాంటి స్థానిక ఆటగాళ్లతోనే జట్టు ఘన విజయాలు సాధించింది. ఇప్పుడు వారి స్థాయిలో ప్లేయర్లు ఉన్నా, అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం,” అంటూ రైనా ఆవేదన వ్యక్తం చేశాడు.
అభిమాని ఆశలపై నీళ్లు – మార్పు అవసరం
చివరగా రైనా చెప్పిన మాటలు చాలా బరువుగా మారాయి – “ఇలా ఆడితే అభిమానులు ఎలా గర్వపడతారు? చెన్నై బ్రాండ్‌కు తగిన ప్రదర్శన ఇప్పటికైనా చూపించాలి. లేకపోతే ఐపీఎల్ చరిత్రలో ఇది చెత్త సీజన్‌గా మిగిలిపోతుంది.”
Read Also : MS Dhoni : రోజుకు 5 లీటర్ల పాలు తాగుతానా ధోనీ రియాక్షన్